America-తీవ్ర సంచలనం సృష్టించిన చార్లీ కిర్క్ హత్యకేసులో(Murder case) నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. నిందితుడిగా అనుమానిస్తున్న టైలర్ రాబిన్సన్ ను స్వయంగా కన్నతండ్రే అప్పగించాడు. కొడుకు తప్పు చేశాడని తెలిసి, అతడిని రక్షించే ప్రయత్నం చేయకుండా స్వయంగా ప్రభుత్వంతో మాట్లాడి మరీ తన్నకొడుకును పోలీసులకు అప్పగించాడు. దీంతో చార్లీ కిర్ను హతమార్చి రెండురోజులుగా తప్పించుకుని తిరుగుతున్న నిందితుడు టైలర్ పోలీసుల కస్టడీలో ఉన్నాడు.

నాన్న ఓ పోలీసు..కొడుకు నేరస్తుడు
టైలర్ రాబిన్సన్(Tyler Robinson) తండ్రి అయిన మ్యాట్ లా ఎన్ ఫోర్స్ మెంట్ విభాగంలో పనిచేశారు. ఈయన వాషింగ్టన్ కౌంటీషెరీఫ్టిపార్ట్ మెంట్లో దాదాపు 27 సంవత్సరాలు పనిచేశారు. కిర్ను హత్య చేసిన అనంతరం ట్రైలర్ తన తండ్రి వద్ద నిజాయితీగా చేసిన నేరాన్ని ఒప్పుకొన్నట్లుగా తెలుస్తోంది. దీంతో తండ్రి మ్యాట్ ఓ మంత్రితో మాట్లాడి, కొడుకును పోలీసులకు అప్పగించాడు. టైలర్ రాబిన్సన్ ఫొటోలు మీడియాలో విడుదల అయిన కొన్ని గంటల్లోనే ఈ పరిణామాలన్నీ జరిగాయని చెబుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో(Social Media) ఈ వార్త వైరల్ గా మారింది. అంతేకాక తండ్రి మ్యాట్ ను అభినందిస్తూ అనేకులు కామెంట్లు చేస్తున్నారు. కొడును రాబిన్సన్ అప్పగించి, ఆదర్శవ్యక్తిగా నిలిచారని మెచ్చుకుంటున్నారు.
సైనిక లాంఛనాలతో చార్లీ కిర్క్ అంత్యక్రియలు
యూనివర్శిటీ విద్యార్థులతో మాట్లాడుతున్న కిర్ను దుండగుడు కాల్పులు జరపడంతో అతడు మరణించాడు. కిర్క్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అత్యంత సన్నిహితుడు. అమెరికాలో భారతీయులకు వ్యతిరేకంగా కిర్క్ గతకొంతకాలంగా చర్చలు, సమావేశాలను నిర్వహిస్తున్నారు. భారతీయులకు ఆ మెరికా వీసాలు ఇవ్వరాదని, భారతీయుల వల్లే తమకు ఉపాధి ఉండడం లేదని నినాదాలు చేసిన వారం రోజులకు కిర్క్ హత్యకు గురికావడంతో దేశంలో విషాదచాయలు నెలకొన్నాయి. కాగా సైనిక లాంఛనాలతో చార్లీ కిర్క్ అంత్యక్రయలు జరిగాయి. కిర్క్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
చార్లీ కిర్క్ ఎవరు?
అమెరికాకు చెందిన వ్యక్తి, ఇటీవల జరిగిన హత్య కేసులో బాధితుడు.
ఈ కేసులో ప్రత్యేకత ఏమిటి?
చార్లీ కిర్క్ తండ్రే హంతకుడిని పట్టుకోవడంలో కీలక ఆధారాలు పోలీసులకు అందించారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: