
ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకులు ఘనంగా జరుగుతున్నాయి. అయితే అమెరికాలోని (America) కాలి ఫోర్నియా(California) రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. హఠాత్తుగా వచ్చిన తుఫాను కారణంగా బలమై గాలులతో కూడిన కుండపోత వర్షం కురిసింది. ఈ వర్షానికి వరదలు చుట్టుముట్టాయి. అనేక U పాంతాలు నీట మునిగాయి. రోడ్లన్నీ నదులను తలపించాయి. కొన్ని ప్రాంతాల్లో బురద పేరుకు పోయింది. వాహనాలు, ఇండ్లు వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి. పలు ప్రాంతాల్లో మట్టి చరియలు విరిగిపడటంతో రహదారులు మూసుకుపోయాయి.
Read also: Bangladesh: షేక్ హసీనా నియోజకవర్గం నుంచి హిందూ అభ్యర్థి పోటీ
ఇళ్లను ఖాళీ చేయించిన అధికారులు
కీలక హైవేలను అధికారులు మూసివేశారు. వరద ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని ప్రజలు ఇళ్లను ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. (America) లాస్ ఏంజిల్స్ కౌంటీలోని కొన్ని ప్రాంతాల్లో 27 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వరదలకు ముగ్గురు మరణించినట్లు అధికారులు తెలిపారు. అధిక వర్షం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఒకవైపు పండుగ ఆనందాన్ని ఆస్వాదించకుండా వర్షాలు తమను ఇబ్బందులకు గురిచేసినట్లు ప్రజలు మీడియా ముందు వాపోతున్నారు. అత్యవసర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also: