ఇటీవల విమాన ప్రమాదాలు పెరగడంతోపాటు తరచూ సాంకేతిక సమస్యలకు గురవుతున్నాయి.దీనితో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తాజాగా అమెరికాలోని అలస్కా,ఎయిర్లైన్స్ (Alaska Airlines) లో సాంకేతిక సమస్య రావడంతో వందల విమానాలను ల్యాండ్ చేయాల్సి వచ్చింది.దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం రాత్రి 8గంటల సమయంలోఐటీ సిస్టమ్స్ లో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో అలాస్కా, హారిజోన్ ఎయిర్లైన్కు చెందినవిమానాలను ల్యాండ్ చేసినట్లు ఆ సంస్థ తెలిపింది.
ప్రయాణీకులకు క్షమాపణలు చెప్పిన ఎయిర్లైన్స్
సియాటెల్ కేంద్రంగా ఈ ఎయిర్లైన్స్ టెక్నికల్ ఇబ్బందుల ప్రభావం సోమవారం సాయంత్రం వరకు ఉండవచ్చని సదరు సంస్థ తెలిపింది. దీనిపై అమెరికా ఎఫ్ఎ (American FA) వెంటనే స్పందించలేదు.ఈ సాంకేతిక సమస్యతో ఎయిర్లైన్స్ నిర్ణయంతో గమ్యస్థానాలకు చేరాల్సిన విమానాలు నిలిచిపోయాయి. ఈ అంతరాయానికి ఎయిర్లైన్స్ ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది.

తప్పిన పెనుప్రమాదం
సరిగ్గా ఏడాదిక్రితం ఇదే విమానయాన సంస్థ కొత్తగా కొనుగోలు చేసిన బోయింగ్ 737 మ్యాక్స్ 9విమానం గాల్లో ఉండగానే తలుపు ఊడిపోయింది. ఈ విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతోపెనుప్రమాదం తప్పింది. అహ్మమాదాబాద్లో విమానం (Ahmedabad AirPlane) కూలీ, 242 మంది,మరణించడంతోప్రపంచవ్యాప్తంగా విమానాల ప్రయాణం అంటేనే ప్రజల్లో ఉన్న భయం పూర్తిగా సమసిపోలేదు.తరచూ నాణ్యతలోపాలు, సాంకేతిక సమస్యలతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకుగురవుతున్నారు. గమ్యస్థానాలకు క్షేమంగా చేరుకుంటామనే భరోసా ఉండడం లేదు.
అలాస్కా విమానాశ్రయం పెద్దదేనా?
అవును, అలాస్కా విమానాశ్రయం (Anchorage’s Ted Stevens Anchorage International Airport) ప్రపంచంలోని ప్రముఖమైన విమానాశ్రయాల్లో ఒకటి.
అలస్కా,ఎయిర్లైన్స్ లో భోజనం ఉచితమా?
సాధారణంగా అలస్కా (Akasa Air) విమానాలలో ఉచిత భోజన సేవ ఉండదు.వారు “బై-ఆన్-బోర్డ్” (Buy-on-board) విధానాన్ని అనుసరిస్తారు. అంటే,ప్రయాణికులు తాము కావలసిన స్నాక్స్, భోజన పదార్థాలు, పానీయాలు వంటి వాటిని విమానం లోపలే కొనుగోలు చేయవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Black mass: బ్లాక్ మాస్ ఎగుమతులపై భారత్ ఆంక్షలు.. చైనాకు భారీషాక్