అమెరికా(America) ను వణికిస్తున్న ఫెర్న్ మంచు తుపాను ఒక ఘోర విమాన ప్రమాదానికి కారణమైంది. మైనే రాష్ట్రంలోని బంగోర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఆదివారం రాత్రి టేకాఫ్ అవుతున్న సమయంలో ఒక ప్రైవేట్ బిజినెస్ జెట్ రన్‌వేపై అదుపుతప్పి బోల్తా పడింది. విమానం బోల్తా(Plane Crash) పడిన వెంటనే మంటలు చెలరేగడంతో విమానాశ్రయం ఒక్కసారిగా దట్టమైన పొగతో నిండిపోయింది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 7:45 గంటల ప్రాంతంలో ఒక సంఘటన జరిగిందని సమాచారం.
Read Also: iPhone 18 Pro price: ఐఫోన్ 18 ప్రో వివరాలు లీక్.. ధర ఎంతంటే?

బంగోర్ ఎయిర్‌పోర్టును తాత్కాలికంగా మూసివేత
హ్యూస్టన్‌కు చెందిన ఒక కంపెనీకి చెందిన ఈ విమానం ప్రమాదానికి గురైన సమయంలో అందులో మొత్తం ఎనిమిది మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మైనస్ 16 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయిన ఉష్ణోగ్రతలు, విపరీతమైన మంచు కురవడం వల్ల విజిబిలిటీ తగ్గి ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే అధికారులు బంగోర్ ఎయిర్‌పోర్టును తాత్కాలికంగా మూసివేసి, విమాన సర్వీసులను రద్దు చేశారు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA), నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించాయి. కేవలం వాతావరణం వల్లే ఈ ప్రమాదం జరిగిందా? లేక విమానంలో ఏదైనా సాంకేతిక లోపం తలెత్తిందా? అనే కోణంలో అధికారులు విచారిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: