Air India flight: హైదరాబాద్ నుంచి థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఫుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో సాంకేతిక లోపం తలెత్తింది. ల్యాండింగ్ గేర్ దెబ్బతినడంతో విమానం రన్‌వేపై ప్రమాదకర స్థితిలో దిగాల్సి వచ్చింది.

Read Also:Hormuz Tensions: ఒక్క చుక్క చమురు కూడా బయటికి రాదు..ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్
పైలట్ల అప్రమత్తతతో విమానం క్షేమంగా ల్యాండ్ అవ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో మొత్తం 133 మంది ప్రయాణికులు ఉన్నారు, వారంతా సురక్షితంగా ఉన్నట్లు విమానాశ్రయ అధికారులు ధృవీకరించారు. ఈ ప్రమాదం కారణంగా రన్‌వే దెబ్బతినడంతో, అధికారులు కొన్ని గంటల పాటు విమాన రాకపోకలను నిలిపివేసి రన్‌వేను మూసివేశారు. ఇతర విమానాలను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: