ప్రజాస్వామ్య పాలన బలమైన పాలన. కానీ కొన్నిదేశాలు ప్రజాస్వామ్యంగా ఎన్నికైన పాలకుల గెలుపును అంగీకరించకుండా సైన్యం దేశాన్ని తమ గుప్పింట్లోకి తీసుకోవడం మనం చూస్తునే ఉన్నాం. తాజాగా పశ్చిమ ఆఫ్రికాలోని (Africa) చిన్న దేశమైన గినియా-బిస్సావులో (guinea bissau) మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం మధ్యాహ్నం రాజధాని బిస్సావులో ఆకస్మాత్తుగా పెద్ద ఎత్తున కాల్పులు జరిగాయి. అధ్యక్ష భవనం చుట్టూ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత కొద్ది సేపటికే సైన్యం మొత్తం దేశాన్ని తమ అధీనంలోకి తీసుకున్నట్లు ప్రకటించింది. దాంతో పాటూ ఎన్నికలకు సంబంధించి అన్ని ప్రక్రియలను నిలిపివేసింది. దీంతో దేశానికి ఉన్న అన్ని అంతర్జాతీయ సరిహద్దులను మూసివేశారు.
Read also :Pakistan: ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగా ఉన్నారు.. జైలు అధికారులు

అధ్యక్షుడు అదృశ్యం
బిస్సావు దేశంలో భయాందోళనలు నెలకొన్నాయి. నగరంలో ప్రధాన ప్రాంతాల్లో సైన్యం తన దళాలను మోహరించింది. వీధుల్లో పెద్ద పెద్ద బారికేడ్లను నిర్మించారు. చాలామంది బిస్సావు నుంచి బయటకు వెళ్లిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అధ్యక్ష భవనం చుట్టూ ఉన్న మొత్తం ప్రాంతం సైనిక ముట్టడిలో ఉందని, పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉందని జర్నలిస్టులు చెబుతున్నారు. అంతేకాక ప్రస్తుత అధ్యక్షుడు ఒమర్ సాసోకో ఎంబాలో కూడా కనిపించడం లలేదు. ఇది మరింత ఆందోళనకు గురిచేస్తున్నది.
పార్లమెంటరీకి జరిగిన ఎన్నికలు సైన్యం తిరుగుబాటుకు మూడురోజుల ముందే గినియా-బిస్సావు దేశ అధ్యక్ష, పార్లమెంటరీ ఎన్నికలు జరిగాయి. నేడు ఫలితాలు వెల్లడించాల్సింది ఉంది. కానీ ఈలోపు సైన్యం దేశాన్ని తన అదుపులోకి తీసుకుంది. మరోవైపు అధికార పార్టీ, ప్రతిపక్షం రెండూ వేర్వేరు విజయాలను ప్రకటించాయి.
అధ్యక్షుడు ఎంబాలో పదవీకాలం పిబ్రవరిలో ముగిసింది. కానీ ఆయన పదవి నుంచి వైదొలగడానికి నిరాకరించారు. దీంతో అక్కడ రాజకీయాలు చాలాకాలం నుంచి గందరగోళంగా మారాయి. గినియా-బిస్సావులో సైన్యం తరచూ అధికారాన్ని చేజిక్కించుకుంటూనే ఉంటుంది. దేశంలో అవినీతి, పేదరికం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి పరిస్థితులు దేశ అస్థిరతకు దారితీస్తున్నది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :