యూకేలోని మాంచెస్టర్లో షాకింగ్ ఘటన జరిగింది. ఒక బ్రిడ్జి కింద నుంచి వెళ్లే క్రమంలో డబుల్ డెక్కర్ బస్సు దానిని ఢీకొట్టింది. దీంతో ఆ బస్సు పైకప్పు ఊడిపోయింది. ఎక్లేస్, సాల్ఫోర్డ్ లోని బార్టన్ లేన్ వద్ద ఉన్న బ్రిడ్జ్ వాటర్ కెనాల్ ఆక్విడక్ట్ (Bridgewater Canal Aqueduct),కింద జరిగిన ఈ ఘటన వీడియో వైరల్ గా మారింది.
డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం
బస్సు బ్రిడ్జికంటే అధిక ఎత్తు ఉన్నాకూడా డ్రైవర్ ఏమాత్రం ముందుజాగ్రత్తగా వ్యవహరించకుండా నిర్లక్ష్యంగా బస్సును బ్రిడ్జికింది,నుంచి తీసుకొచ్చాడు. బస్సు (Bus) బ్రిడ్డికంటే ఎక్కువగా ఉండడంతో బస్సు పైకప్పు పూర్తిగా ఊడిపోయింది. ఈ ప్రమాదంలో బస్సులోఉన్న 15మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయని, ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
కొనసాగుతున్న సహాయక చర్యలు
ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర సేవలు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగ్రాతులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డ్రైవర్ ఎత్తు పరిమితి హెచ్చరికలు,సైన్ బోర్డులు ఉన్నా వాటిని పట్టించుకోలేదని తెలిపారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ప్రయాణికుల గాయాలకుకారణమయ్యాడనే ఆరోపణలపై అతడిని అరెస్టు చేశారు.
హెచ్చరిక బోర్డు
ఎందుకంటే బస్సు డబుల్రెక్కర్. సాధారణంగా ఇలాంటి బస్సులుఎత్తుగానే ఉంటాయి. అయితే కొన్నిచోట్ల బ్రిడ్జి (Bridge) లు బస్సు ఎత్తుకంటే తక్కువ ఎత్తులో ఉంటాయి. ఇలాంటప్పుడు దీనికి సంబంధించిన హెచ్చరిక బోర్డులు, ఎత్తుపరిమితి, సైన్ బోర్డులను తప్పనిసరిగా ఉంటాయి. డ్రైవర్లు వీటిని గమనించి, తగిన జాగ్రత్తలతో డ్రైవింగ్ చేయడం వల్ల ప్రయాణీకుల ప్రాణాలను కాపాడినవారుగా ఉంటారు.
యునైటెడ్ కింగ్‌డమ్ (UK) ను ఏర్పరిచే నాలుగు ప్రధాన దేశాలు ఏవి?
యునైటెడ్ కింగ్‌డమ్ (UK) ను నాలుగు దేశాలు కలిసి ఏర్పరుస్తాయి. అవి:ఇంగ్లాండ్ (England)స్కాట్లాండ్ (Scotland)వేల్స్ (Wales)ఉత్తర ఐర్లాండ్ (Northern Ireland).
యునైటెడ్ కింగ్‌డమ్ (UK)లో మొత్తం ఎన్ని నగరాలు ఉన్నాయి?
2022 నవంబర్ 22 నాటికి యునైటెడ్ కింగ్‌డమ్‌లో మొత్తం 76 నగరాలు ఉన్నాయి. అవి ఇలా విభజించబడ్డాయి:ఇంగ్లాండ్‌లో: 55 నగరాలు,స్కాట్లాండ్‌లో: 8 నగరాలు,వేల్స్‌లో: 7 నగరాలు,ఉత్తర ఐర్లాండ్‌లో: 6 నగరాలు.
Read hindi news: hindi.vaartha.com