हिन्दी | Epaper
ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్

Latest News: Diwali: దీపావళి పండుగకు అరుదైన గౌరవం

Anusha
Latest News: Diwali: దీపావళి పండుగకు అరుదైన గౌరవం

భారతదేశ సంప్రదాయాలు, సంస్కృతి, ఆధ్యాత్మికత ప్రపంచవ్యాప్తంగా ఎప్పటి నుంచో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాయి. అయితే తాజాగా భారతీయుల అతిపెద్ద పండుగ దీపావళి (Diwali) కు యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (UNESCO) నుంచి అరుదైన గౌరవం దక్కింది. ఈ దీపాల పండుగను UNESCO Intangible Cultural Heritage జాబితాలో చేర్చారు..ఈ అరుదైన ఘనత సాధించిన భారతదేశం నుంచి దీపావళి 16వ సంప్రదాయంగా నిలిచింది. అంతకుముందు యోగా, దుర్గా పూజ వంటి సంప్రదాయాలు ఈ జాబితాలో ఉన్నాయి.

Read Also: Australia social media ban : ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం అమలు…

“ఇది భారతదేశానికి చారిత్రక దినం. దీపావళి (Diwali) అధికారికంగా యునెస్కో అమూర్త సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్చబడింది” అని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు. గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోదీ జీ హయాంలో.. భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి అపూర్వమైన ప్రపంచ గుర్తింపు లభిస్తోందని చెప్పారు.

ఈ మైలురాయి ఆ ప్రయాణాన్ని మరింత బలోపేతం చేస్తుందని చెప్పారు. ఈ గౌరవం దీపాల పండుగ ఇచ్చే విశ్వ సందేశాన్ని (నిరాశపై ఆశ, విభజనపై సామరస్యం, అందరికీ వెలుగును) చాటిచెబుతుందని మంత్రి వెల్లడించారు.

A rare tribute to the festival of Diwali
A rare tribute to the festival of Diwali

అంతర్-ప్రభుత్వ కమిటీ 20వ సమావేశం

యునెస్కో అమూర్త సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించే అంతర్-ప్రభుత్వ కమిటీ 20వ సమావేశం ప్రస్తుతం న్యూఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట వద్ద జరుగుతోంది. డిసెంబర్ 8వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరుగనున్న ఈ ప్రతిష్టాత్మక సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడం భారత్‌కు ఇదే మొదటిసారి.

అయితే ఈ కమిటీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సాంస్కృతిక ఆచారాలు, సంప్రదాయాలను అంతర్జాతీయ గుర్తింపు, రక్షణ కోసం మూల్యాంకనం చేస్తుంది. దాదాపు వారం రోజుల పాటు కొనసాగనున్నఈ సమావేశాల్లో.. 79 దేశాలు సమర్పించిన 67 నామినేషన్లను కమిటీ పరిశీలిస్తోంది. అందులో భారతదేశం తరపున దీపావళి కూడా ఉంది.

ఈ జాబితాలో దీపావళి చేరికతో పాటు జార్జియా దేశానికి చెందిన “జార్జియన్ గోధుమ సంస్కృతి: సంప్రదాయాలు, ఆచారాలు”కు కూడా యునెస్కో గుర్తింపు లభించింది. పండుగలు, ఆచారాల నుంచి వ్యవసాయ, హస్తకళా సంప్రదాయాల వరకు ఈ ఏడాది సమర్పించిన నామినేషన్ల వైవిధ్యం, సాంస్కృతిక సంప్రదాయాల పరిరక్షణపై పెరుగుతున్న అంతర్జాతీయ ఆసక్తిని తెలియజేస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870