
Manchu Vishnu Dubai: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల ప్రభావం ఇప్పుడు దుబాయ్‌పై కూడా పడింది. ఇరాన్ ప్రయోగించిన మిస్సైళ్లు దుబాయ్ నగరాన్ని లక్ష్యంగా చేసుకోవడంతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది. ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి సెలవుల్లో ఉన్న టాలీవుడ్ నటుడు మంచు విష్ణు ఈ దాడుల మధ్య చిక్కుకుపోయారు. తాము ఉంటున్న ఇంటికి అత్యంత సమీపంలో మిస్సైళ్లు పేలడంతో ఇల్లు ఒక్కసారిగా కంపించిందని, తీవ్ర భయాందోళనకు గురయ్యామని ఆయన వెల్లడించారు.
Read Also: Geeturoyal Tirumala Reels Controversy: తిరుమల ఘాట్ రోడ్డులో గీతూ రాయల్ రీల్స్ కలకలం
సోషల్ మీడియాలో భయానక వీడియో
ముఖ్యంగా క్షిపణులను అడ్డుకుంటున్న సమయంలో వచ్చిన భారీ శబ్దాలకు తాము బస చేసిన ఇల్లు దద్దరిల్లిపోయిందని విష్ణు పేర్కొన్నారు. ఈ శబ్దాలకు తన చిన్న కూతురు ఐరా తీవ్రంగా భయపడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏ చిన్నారి కూడా ఇలాంటి యుద్ధ వాతావరణంలో, బాంబుల శబ్దాల మధ్య పెరగకూడదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా పిల్లలకు ప్రశాంతమైన వాతావరణం ఉండాలని ఆకాంక్షించారు.
అయితే, పౌరుల రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న యూఏఈ రక్షణ దళాలకు మంచు విష్ణు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వారి వల్లే తాము క్షేమంగా ఉన్నామని చెప్పారు. జీవితం ఎంత చిన్నదో, ఎంత సున్నితమైనదో ఇలాంటి ఘటనలు గుర్తుచేస్తాయని ఎమోషనల్ అయ్యారు. అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ, శాంతి నెలకొనాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. చివరగా ‘హర హర మహాదేవ్’ అంటూ తన సందేశాన్ని ముగించారు. ప్రస్తుతం మంచు విష్ణు చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: