మీరు అమెరికా (America) పర్యటనకు లేదా చిన్న వ్యాపార ప్రయాణానికి ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీ కోసం తప్పకుండా తెలుసుకోవాల్సిన వార్త. తాజాగా అమెరికా విదేశాంగ శాఖ ఒక కొత్త ప్రయోగాత్మక నిబంధనను తీసుకొచ్చింది. బీ-1 (స్వల్పకాలిక వ్యాపార) మరియు బీ-2 (పర్యాటక) వీసాలపై అమెరికాకు వెళ్లే కొంతమందికి ఇకపై బాండ్ చెల్లించాల్సి ఉంటుంది.ఈ కొత్త నిబంధన ప్రకారం, కొందరు దరఖాస్తుదారులు అమెరికా వీసా పొందాలంటే (To get a US visa) 5,000 డాలర్ల నుంచి 15,000 డాలర్ల వరకు బాండ్ (అదే మన రూపాయల్లో సుమారు ₹4 లక్షల నుంచి ₹12.5 లక్షల వరకు) చెల్లించాల్సి ఉంటుంది. ఈ బాండ్ విధానం ఒక్కసారిగా అందరికీ వర్తించదు. కన్సులర్ అధికారులు ఎవరికెవరికీ అవసరమో వాళ్ల బ్యాక్‌గ్రౌండ్ ఆధారంగా నిర్ణయిస్తారు.వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అమెరికాలో ఉండిపోయే వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా అక్రమ వలసలను అరికట్టేందుకే ఇది ప్రయోగాత్మకంగా తీసుకొచ్చారు. ఇది ట్రంప్ ప్రభుత్వం జారీ చేసిన విధానాల ఆధారంగా రూపొందించారు.

ఎప్పుడు అమల్లోకి వస్తుంది?
ఈ నిబంధనను ఆగస్టు 5న అధికారికంగా ఫెడరల్ రిజిస్టర్‌లో ప్రకటించి, 15 రోజుల తర్వాత అంటే ఆగస్టు 20 నుంచి అమలు చేయనున్నారు. ఈ పైలట్ ప్రోగ్రామ్ ఒక సంవత్సరం పాటు, అంటే ఆగస్టు 2026 వరకు కొనసాగుతుంది. తరువాత ఫలితాలపై ఆధారపడి కొనసాగించాలా లేదా అనేది నిర్ణయిస్తారు.ఇది ప్రతి దేశానికి వర్తించదు. వీసా నిబంధనల ఉల్లంఘనలు ఎక్కువగా ఉన్న దేశాలను మాత్రమే ఈ నిబంధనలోకి తీసుకుంటారు. వాటి జాబితాను త్వరలో విడుదల చేస్తామని విదేశాంగ శాఖ పేర్కొంది. అలాగే, వీసా వేవర్ ప్రోగ్రాం ద్వారా వచ్చే ప్రయాణికులకు ఈ నియమం వర్తించదు.
వీసా ప్రమాణాలు: ఎంట్రీ ఒకటే, కాల పరిమితి తక్కువే
ఈ బాండ్ కింద ఇచ్చే వీసాలు సింగిల్ ఎంట్రీకి మాత్రమే మంజూరు అవుతాయి. వీసా జారీ అయిన తేదీ నుంచి మూడు నెలల వరకే చెల్లుబాటులో ఉంటుంది. అమెరికాలోకి వెళ్లిన తర్వాత గరిష్ఠంగా 30 రోజులు మాత్రమే ఉండే ఛాన్స్ ఉంటుంది.ఇది అందరికీ ప్రధానంగా కలిగే సందేహం. అధికారుల వివరణ ప్రకారం, వీసా నిబంధనలు కచ్చితంగా పాటించి, సమయంలోగా తిరిగి వచ్చిన ప్రయాణికులకు చెల్లించిన బాండ్ మొత్తాన్ని పూర్తిగా తిరిగి చెల్లిస్తారు. కాబట్టి మీరు నిబంధనలకన్నా ముందే ప్లాన్ చేస్తే, ఏ ఇబ్బంది లేదు.మీరు త్వరలో అమెరికా పర్యటనకు ప్లాన్ చేస్తే, ఈ కొత్త వీసా బాండ్ నిబంధన గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీ వీసా అప్లికేషన్‌కు ముందు తాజా సమాచారం తెలుసుకోండి, అవసరమైతే బాండ్ కు సిద్ధంగా ఉండండి. దీని వల్ల ఎలాంటి అనుకోని షాక్‌లు రాకుండా చూసుకోవచ్చు!
Read Also : 42% BC reservations : 42% రిజర్వేషన్ల కోసం నేటి నుంచి ఢిల్లీలో నిరసనలు