పోర్చుగల్ రాజధాని లిస్బన్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించే చారిత్రక గ్లోరియా ఫ్యూనిక్యులర్ (కేబుల్ రైలు) బోల్తా (Funicular (cable train) rollover) కొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది అక్కడికక్కడే మృతి (15 people died on the spot in the accident) చెందగా, మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎమర్జెన్సీ అధికారులు తెలిపారు.లిస్బన్ నగరంలోని అవెనిడా డా లిబర్డేడ్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రమాద తీవ్రతకు క్యారేజ్ నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను ఆసుపత్రులకు తరలించారు. ప్రమాద స్థలాన్ని పోలీసులు పూర్తిగా తన నియంత్రణలోకి తీసుకున్నారు.

జాతీయ సంతాప దినం ప్రకటించిన ప్రభుత్వం
ఈ విషాదం నేపథ్యంలో పోర్చుగల్ అధ్యక్షుడు మార్సెలో రెబెలో డి సౌసా కీలక నిర్ణయం తీసుకున్నారు. గురువారం నుంచి ఆదివారం వరకు జరగాల్సిన పుస్తక మహోత్సవాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. బాధితుల కుటుంబాలకు సంఘీభావంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధ్యక్ష భవనం తెలిపింది. గురువారం జాతీయ సంతాప దినంగా ప్రకటించారు. ఇది లిస్బన్ చరిత్రలో అత్యంత కష్టమైన రోజు అని, నగరం తీవ్రంగా పోరాడుతోందని మేయర్ కార్లోస్ మోదాస్ ఆవేదన వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ స్పందన
ఈ ప్రమాదంపై ప్రపంచ దేశాల నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యూరోపియన్ యూనియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్, స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్, ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తజానీ సహా పలువురు నేతలు మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. లిస్బన్‌లోని అమెరికా రాయబార కార్యాలయం కూడా బాధితులకు సంఘీభావం ప్రకటించింది. ప్రమాద కారణాలపై త్వరలోనే సమగ్ర దర్యాప్తు ప్రారంభిస్తామని పోర్చుగల్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
చారిత్రక ఫ్యూనిక్యులర్‌కి మచ్చ
19వ శతాబ్దం చివర్లో నిర్మించిన గ్లోరియా ఫ్యూనిక్యులర్, ఏటవాలు కొండలపై నడుస్తూ పర్యాటకులకు ప్రత్యేక అనుభూతి కలిగిస్తుంది. ప్రతీ ఏడాది వేలాది మంది ఈ రైలులో ప్రయాణిస్తారు. అయితే, 2018లో కూడా ఇదే ఫ్యూనిక్యులర్ పట్టాలు తప్పింది. కానీ ఆ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. ఇప్పుడు మాత్రం భారీ ప్రాణనష్టం జరగడం స్థానికులను, పర్యాటకులను తీవ్రంగా కలిచివేసింది.
స్థానికులు, పర్యాటకుల్లో ఆందోళన
లిస్బన్ పర్యాటక రంగానికి ఇది పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. నగర చరిత్రలో గుర్తుండిపోయే ఈ ఫ్యూనిక్యులర్ ఇప్పుడు భయంకరమైన దుస్థితిని సృష్టించింది. మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి వెల్లువెత్తుతోంది. గాయపడిన వారు క్షేమంగా బయటపడాలని అందరూ ప్రార్థిస్తున్నారు. ఈ ఘటన పోర్చుగల్‌కే కాకుండా, ప్రపంచ పర్యాటక రంగానికి కూడా కలచివేసే సంఘటనగా నిలిచింది.
Read Also :