हिन्दी | Epaper
పడవ బోల్తా.. ఏడుగురు మృతి రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి పడవ బోల్తా.. ఏడుగురు మృతి రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి పడవ బోల్తా.. ఏడుగురు మృతి రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి పడవ బోల్తా.. ఏడుగురు మృతి రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి

Canada: చట్టబద్ధ హోదా కోల్పోయే ప్రమాదంలో 10 లక్షల మంది భారతీయులు

Vanipushpa
Canada: చట్టబద్ధ హోదా కోల్పోయే ప్రమాదంలో 10 లక్షల మంది భారతీయులు

2025-2026 సంవత్సరాల్లో లక్షల సంఖ్యలో వర్క్ పర్మిట్‌లు గడువు ముగియనున్న నేపథ్యంలో.. కెనడా(Canada) ఒక తీవ్రమైన వలస సంక్షోభం వైపు దూసుకుపోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామం వల్ల చట్టబద్ధ హోదా కోల్పోయే ప్రమాదంలో ఉన్నవారిలో భారతీయుల సంఖ్య అత్యధికంగా ఉండే అవకాశం ఉందని ఇమ్మిగ్రేషన్ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజెన్‌షిప్ కెనడా (IRCC) అధికారిక డేటాను బేస్ చేసుకుని ఈ హెచ్చరికలు వెలువడ్డాయి. మిస్సిస్సాగా కేంద్రంగా పనిచేస్తున్న ఇమ్మిగ్రేషన్ కన్సల్టెంట్ కన్వర్ సెయిరా ప్రకారం.. కేవలం 2025 చివరి నాటికి సుమారు 10.53 లక్షల వర్క్ పర్మిట్‌లు గడువు ముగియనున్నాయి. అదే విధంగా 2026 సంవత్సరంలో మరో 9.27 లక్షల వర్క్ పర్మిట్‌లు ముగియబోతున్నాయి. అంటే రెండేళ్ల వ్యవధిలోనే దాదాపు రెండు మిలియన్ల మంది తాత్కాలిక నివాసితులు తమ చట్టబద్ధ హోదాను కోల్పోయే ప్రమాదంలో పడే అవకాశం ఉందన్న మాట.

Read Also: Amazon: హెచ్-1బి ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్

Canada: చట్టబద్ధ హోదా కోల్పోయే ప్రమాదంలో 10 లక్షల మంది భారతీయులు
Canada: చట్టబద్ధ హోదా కోల్పోయే ప్రమాదంలో 10 లక్షల మంది భారతీయులు

వర్క్ పర్మిట్ గడువు ముగిసిన తర్వాత..

సంబంధిత వ్యక్తి మరొక వీసా మార్గంలోకి మారకపోతే లేదా శాశ్వత నివాసం (పీఆర్) పొందకపోతే.. అతను లేదా ఆమె అవుట్-ఆఫ్-స్టేటస్ గా మారతారని సెయిరా వివరించారు. గతంలో ఉన్న మార్గాలతో పోలిస్తే.. ఇటీవలి కాలంలో కెనడా తీసుకున్న విధాన మార్పులు వీటిని మరింత కఠినంగా మార్చాయని ఆయన అన్నారు. ముఖ్యంగా తాత్కాలిక కార్మికులు, అంతర్జాతీయ విద్యార్థులకు వర్క్ పర్మిట్ నుంచి పీఆర్‌కు మారడం ఇప్పుడు చాలా క్లిష్టమైన ప్రక్రియగా మారింది. 2025 చివరి త్రైమాసికంలోనే 2.91 లక్షలకు పైగా వర్క్ పర్మిట్‌లు గడువు ముగియనున్నాయి. దానికి కొనసాగింపుగా.. 2026 జనవరి నుంచి మార్చి మధ్యకాలంలోనే దాదాపు 3.15 లక్షల వర్క్ పర్మిట్‌లు ముగియనున్నాయని అంచనా. ఇంత భారీ సంఖ్యలో ఎక్స్‌పైరీలను కెనడా ఇంతకు ముందు ఎప్పుడూ ఎదుర్కోలేదని సెయిరా పేర్కొన్నారు. ఈ పరిస్థితి కొనసాగితే.. 2026 మధ్య నాటికి కెనడాలో చట్టబద్ధ హోదా లేకుండా నివసిస్తున్న వారి సంఖ్య రెండు మిలియన్లకు చేరుకోవచ్చని ఆయన అంచనా వేశారు. అందులో సగం మంది భారతీయులే ఉండవచ్చని చెప్పారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870