దేశవ్యాప్తంగా కోట్లాది మంది వాడే చిన్న మొత్తాల పొదుపు పథకాలపై (On savings schemes) కేంద్ర ప్రభుత్వం తాజా కీలక ప్రకటన చేసింది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన వంటి ప్రముఖ పథకాలపై వడ్డీ రేట్లను (Interest Rates) యథాతథంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. జులై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు వర్తించే రెండో త్రైమాసికంలో ఎలాంటి మార్పులు ఉండవని ఆర్థిక శాఖ సోమవారం తెలిపింది.ఇటీవల రెపో రేటు తగ్గిన నేపథ్యంలో వడ్డీ తగ్గనుందనే ప్రచారం జరిగింది. ప్రభుత్వ బాండ్ల రాబడి తగ్గిందని పేర్కొంటూ చిన్న పొదుపు పథకాలపై వడ్డీ కోత రాబోతోందని నిపుణులు ఊహించారు. కానీ కేంద్రం అంచనాలకు చెక్ వేసింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి అమల్లో ఉన్న రేట్లే తదుపరి త్రైమాసికానికి కూడా వర్తిస్తాయని స్పష్టం చేసింది.
ఇంకా కొనసాగుతున్న అత్యధిక వడ్డీ పథకాలు
ఆడపిల్లల భద్రత కోసం రూపొందించిన సుకన్య సమృద్ధి యోజన పథకంపై అత్యధికంగా 8.2 శాతం వడ్డీ అందుతోంది. అలాగే పీపీఎఫ్, మూడేళ్ల టర్మ్ డిపాజిట్లపై 7.1 శాతం వడ్డీ లభిస్తోంది.
ప్రధాన ఇతర పథకాలపై రేట్లు ఇలా ఉన్నాయి
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC): 7.7%
కిసాన్ వికాస్ పత్ర (KVP): 7.5% (మెచ్యూరిటీ 115 నెలలు)
నెలవారీ ఆదాయ పథకం: 7.4%
పోస్టాఫీస్ సేవింగ్స్ డిపాజిట్: 4%
అలాగే ప్రతి త్రైమాసికం రివ్యూ చేయడం సాధారణ ప్రక్రియ
కేంద్ర ప్రభుత్వం ఈ వడ్డీ రేట్లను ప్రతి త్రైమాసికానికి సమీక్షిస్తుంది. అయితే వరుసగా ఆరు త్రైమాసికాలుగా వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేకపోవడం విశేషం. చివరిసారిగా 2023-24 చివర్లో మాత్రమే కొన్ని పథకాలపై మార్పులు చేశారు.ఈ స్థిరత్వం పొదుపుదారులకు భరోసా కలిగించనుంది. బ్యాంకుల వడ్డీ తగ్గినా, ఈ పథకాల్లో పెట్టుబడి లాభదాయకంగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Read Also : Languria Waterfall : జలపాతంలో చిక్కుకున్న ఆరుగురు మహిళలు..