Inter classes from April 1. Holidays will be shortened

ఏప్రిల్ 1 నుంచే ఇంటర్ క్లాసులు.. సెలవులు కుదింపు

అమరావతి: ఏపీ ఇంటర్ విద్యలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 2025–26 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఇంటర్‌లో ఎన్సీఈఆర్టీ సిలబస్‌ను, సీబీ ఎస్‌ఈ విధానాలను అమలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచే సెకండియర్ తరగతులు ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది. అకడమిక్ తో పోటీ పరీక్షలకు సంబంధించి ఏప్రిల్ 22వ తేదీ వరకు క్లాసులు నిర్వహించనుంది.అకడమిక్‌తో పోటీ పరీక్షలకు సంబంధించి 22వ తేదీ వరకు క్లాసులు.ఏప్రిల్ 1 నుంచే ఇంటర్ క్లాసులు.. సెలవులు కుదింపు.

Advertisements
ఏప్రిల్ 1 నుంచే ఇంటర్ క్లాసులు
ఏప్రిల్ 1 నుంచే ఇంటర్ క్లాసులు

తొలి 23 రోజుల్లో దాదాపుగా 15 శాతం సిలబస్‌

ఏప్రిల్‌ 5 నుంచి మొదటి సంవత్సరం ప్రవేశాలు చేపడతారు. ఏప్రిల్ 23 నుంచి జూన్ 1 వరకు సెలవులు ఇవ్వనుంది. గతంలో పరీక్షల పూర్తయిన వెంటనే సెలవులు ఇస్తుండగా ఇకపై వాటిని కుదించనుంది. తొలి 23 రోజుల్లో దాదాపుగా 15 శాతం సిలబస్‌ పూర్తిచేసి వేసవి సెలవులు ఇవ్వనున్నారు. ఇంటర్ విద్యలో సాధ్యాసాధ్యాలు, అమలు చేయాల్సిన మార్పులపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీలు12 రాష్ట్రాల్లో పర్యటించి ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ మార్పులకు శ్రీకారం చుట్టాయి.

ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లు రిలీజ్

ఇక రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లు రిలీజ్ అయ్యాయి. 2025 మార్చి 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్, 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు సెంకడియర్ పరీక్షలు జరగనున్నాయి. ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగనున్నాయి. వాట్సప్‌ గవర్నెన్స్‌ ద్వారా ఇంటర్ హాల్ టికెట్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే.. ఇంటర్‌ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ ‘https://bie.ap.gov.in/’ ద్వారా కూడా విద్యార్థులు తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. వాట్సాప్‌ నంబర్ 9552300009 ద్వారా AP Inter Hall Ticket డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Related Posts
400 ఎకరాల్లో మెగా వ్యవసాయ మార్కెట్ – మంత్రి తుమ్మల
thummala

హైదరాబాద్ సమీపంలోని కోహెడలో ప్రపంచ స్థాయి మెగా వ్యవసాయ మార్కెట్ ఏర్పాటుకు సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రకటన చేసారు. ఈ మార్కెట్ నిర్మాణానికి రూ.2 Read more

ఏపీలో మరో రెండు బీసీ గురుకులాలు
Two more BC Gurukulas in AP

ఏపీలో ప్రస్తుతం 107 బీసీ గురుకులాలు ఉన్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు కొత్త గురుకులాలను ప్రారంభించనుంది. ఈ గురుకులాలు Read more

టెక్కీల స్థానంలో ఏఐ: టెక్ కంపెనీ సీఈవో..
ai

ప్రపంచ స్థాయిలో ఇప్పుడు ఐటీ ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తున్న అంశం ఏఐ. చాలా మంది సీఈవోలు, కంపెనీల నాయకులు దీనితో ఉద్యోగులకు ప్రమాదం ఉండదని సర్థిచెప్పే ప్రయత్నాలు Read more

Gold: మళ్లీ పెరిగిన బంగారం ధరలు
Gold: మళ్లీ పెరిగిన బంగారం ధరలు

బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి – మదుపర్ల ఆందోళన పెరుగుతోంది కొన్ని రోజుల పాటు క్రమంగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగి Read more

×