dil raju

ఇండస్ట్రీ అంతా ఐటీ సోదాలు జరుగుతున్నాయి: దిల్ రాజు

ఐటీ సోదాలు తన ఒక్కడిపైనే జరగడంలేదని, ఇండస్ట్రీ అంతా జరుగుతున్నాయని ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పష్టం చేశారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, ఆయన బంధువుల నివాసాలు, కార్యాలయాల్లో నిన్నటి నుంచి ఐటీ సోదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. పలువురు ఇతర నిర్మాతలపైనా ఐటీ దాడులు జరుగుతున్నాయి. అయితే మీడియాలో తన గురించే ప్రముఖంగా ప్రచారం జరుగుతుండడం పట్ల దిల్ రాజు విచారం వ్యక్తం చేశారు!ఐటీ సోదాలు తన ఒక్కడిపైనే జరగడంలేదని, ఇండస్ట్రీ అంతా జరుగుతున్నాయని దిల్ రాజు స్పష్టం చేశారు. ఐటీ అధికారుల సోదాలు జరుగుతున్న సమయంలో దిల్ రాజు బాల్కనీలోకి రాగా…. ఐటీ దాడులు పూర్తయ్యాయా? అని మీడియా ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు దిల్ రాజు పైవిధంగా సమాధానమిచ్చారు. ఐటీ అధికారులు వాళ్ల డ్యూటీ వాళ్లు చేస్తున్నారు అని వ్యాఖ్యానించారు. కాగా, నిన్న ఉదయం 6 గంటల నుంచి ఐటీ అధికారులు పలు బృందాలుగా ఏర్పడి హైదరాబాదులోని టాలీవుడ్ నిర్మాతలు, పలు సినీ మీడియా సంస్థలపై ఏకకాలంలో దాడులు చేపట్టారు. ఇవాళ కూడా సోదాలు కొనసాగుతున్నాయి.

Related Posts
వీహెచ్‌పీ హెచ్చరిక: ఉప్పల్‌లో భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్‌ను అడ్డుకుంటాం.
vhs

హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగబోయే భారత్-బంగ్లాదేశ్ ట్వంటీ 20 మ్యాచ్ పై విశ్వహిందూ పరిషత్ (VHP) తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. బంగ్లాదేశ్‌లో Read more

చర్లపల్లి రూట్ లో వెళ్తున్న ఈ రైళ్లు రద్దు
చర్లపల్లి రూట్ లో వెళ్తున్న ఈ రైళ్లు రద్దు

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహా కుంభ మేళా 2025ను ఘనంగా ఆతిథ్యం ఇస్తోంది. దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వచ్చి త్రివేణి సంగమంలో పవిత్ర Read more

19న బీఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం
KCR to hold BRS executive meet on February 19

పార్టీ నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు బీఆర్‌ఎస్‌ సిద్ధమైంది. హైదరాబాద్‌: ఫిబ్రవరి 19న మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం Read more

గత పదేళ్లలో కేసీఆర్‌ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది..?: మంత్రి పొన్నం
unnamed file

హైదరాబాద్‌: మంత్రి పొన్నం ప్రభాకర్‌ నేడు గాంధీ భవన్‌లో 'మంత్రులతో ముఖాముఖి' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గత కేసీఆర్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గత Read more