గురు పౌర్ణమి సందర్భంగా వేదపండితులకు గురుపూజ
ఇంద్రకీలాద్రి : ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలను పూర్ణాహుతితో స్వస్థి పలికారు. గురువారం నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలో ఇఓ వికె శీనా నాయక్ దంపతులు పాల్గొన్నారు. సప్తశతీ పారాయణం, మహావిద్యా పారాయణము, హోమము, శాంతి పౌష్టిక హోమాలు, మంటపపూజ, ఉదయం 9.30కు పూర్ణాహుతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఇఓ వికె శీనానాయక్ (VK Seenanayak) మట్లాడుతూ సుమారు 2 లక్షల మంది భక్తులు ఈ ఉత్సవాల్లో దుర్గమ్మవారిని సజావుగా ఆనందంగా దర్శించుకున్నారన్నారు. శాకంబరి మాతగా దుర్గమ్మను దర్శించుకోడానికి చివరి రోజు కావడంతో భక్తులు వెల్లువెత్తారు. ఒక దశలో చాలా సేపు అంతరాలయ దర్శనాలను నిలిపేయాల్సి వచ్చింది.
భక్తులందరికి
ఇఓ వికె శీనా నాయక్ పలు సూచనలు ఆదేశాలిస్తూ అధికారులను అప్రమత్తం చేయడంతో క్యూలైన్లు త్వరితంగా ముందుకు సాగి భక్తులందరికి సాఫీగా దర్శనమయింది. ఈ సందర్భంగా భక్తులందరికి శ్రీ అమ్మవారి అన్న ప్రసాదం అందేలా ఇఓ ఆదేశాల మేరకు ఆలయాధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ మూడురోజుల ఉత్సవాల్లో అలంకరించిన పండ్లు కూరగాయలతో రూపొందించిన కదంబ ప్రసాదాన్ని భక్తులకు (devotees) పంచిపెట్టారు. ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షణ కార్యక్రమం గురువారం వైభవంగా జరిగింది. ఆషాఢమాసం గురు పౌర్ణమి సందర్భంగా ఉదయం 5.55లకు ఘాట్రోడ్డులో వేంచేసియున్న శ్రీ కామధేను ఆలయం వద్ద ప్రారంభించారు.

ప్రత్యేక పూజలు
ఇఓ వికె శీనా నాయక్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వ్యాసపౌర్ణమి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున గిరి ప్రదక్షణ కార్యక్రమంలో పాల్గొని శ్రీ అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. గిరి ప్రదక్షణ సందర్భంగా భక్తబృందాలు కోలాట ప్రదర్శన, నృత్యఅభినయాలు, విచిత్రవేషధారణలతో ముందు ప్రదర్శనగా సాగుతుండగా డప్పు, ఢమరుక, డోలు, సన్నాయి నాదాలతో వేదమంత్రాలను పఠిస్తూ గిరి ప్రదక్షణ (Giri Pradakshana) ను పూర్తి చేశారు. దుర్గమ్మవారి ఆలయంలో జరిగే నిత్యాన్నదాన కార్యక్రమానికి ఇఓ వికె శీనా నాయక్ శ్రీ అమ్మవారి ఆలయంలో అందిన తన మొదటి జీతంలో రు.50వేలను విరాళంగా గురువారం అందించారు. ఈ సందర్భంగా ఈఓకు వేదపండితులు వేదాశీర్వచనం పలికారు.
శాకంబరి ఉత్సవాలు ఎక్కడ నిర్వహించబడతాయి?
శాకంబరి ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో ఉన్న ఇంద్రకీలాద్రి కొండపై కనకదుర్గ అమ్మవారి ఆలయంలో నిర్వహించబడతాయి.
శాకంబరి ఉత్సవాల ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి?
వర్షాభావం, పంటల లోటు వంటి పరిస్థితుల నుంచి భూమిని విముక్తి చేయాలని, పుష్కల వర్షాలు కురవాలని ప్రార్థిస్తూ ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు.
Read hindi news: hindi.vaartha.com