దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ (Indore) నగరం మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. ఇది వరుసగా ఎనిమిదోసారి ఇండోర్ (Indore)కు ఈ గౌరవం దక్కడం విశేషం. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షన్ 2024లో ఇండోర్ (Indore)మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇవాళ ఆ నగరానికి స్వచ్ఛ సర్వేక్షన్ (Clean Survey)అవార్డును అందజేశారు.స్వచ్ఛ నగరాల జాబితాలో ఇండోర్ తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇలా ఈ నగరం మొదటి స్థానంలో నిలవడం ఇది ఎనిమిదోసారి కావడం విశేషం. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇవాళ ఆ నగరానికి స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డును అందజేశారు. ఇక రెండో స్వచ్ఛమైన నగరంగా సూరత్, మూడో స్థానంలో ముంబై మహా నగరం నిలిచింది.

ఏపీలోని ఐదు నగరాలకు
కేంద్ర ప్రభుత్వం వివిధ కేటగిరీల్లో ‘స్వచ్ఛ సర్వేక్షణ్’ అవార్డులు ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024–25 అవార్డులను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇవాళ ప్రదానం చేశారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన వేడుకల్లో ‘స్వచ్ఛ’ జాబితాలో నిలిచిన నగరాలకు అవార్డులను ప్రదానం చేశారు. కేంద్రం ప్రకటించిన ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో ఏపీలోని ఐదు నగరాలకు చోటు దక్కింది. విశాఖపట్నం జాతీయస్థాయిలో స్పెషల్ కేటగిరీ మినిస్టీరియల్ అవార్డు దక్కించుకుంది. రాజమహేంద్రవరానికి రాష్ట్రస్థాయిలో మినిస్టీరియల్ అవార్డు లభించింది. స్వచ్ఛ సూపర్‌లీగ్ సిటీస్ విభాగంలో విజయవాడ, తిరుపతి, గుంటూరు ఎంపికయ్యాయి.
ఇండోర్ 7 స్టార్ సిటీ?
ఇండోర్‌ను వరుసగా 7 సంవత్సరాలుగా మరే ఇతర నగరం అధిగమించలేదు. అంతే కాదు, 2022లో, ఇది భారతదేశంలో మొట్టమొదటి “సెవెన్-స్టార్ సర్టిఫైడ్ వేస్ట్-ఫ్రీ సిటీ”గా అవతరించింది. 2023లో, ఇండోర్ 1 మిలియన్ కంటే ఎక్కువ జనాభాతో “క్లీన్ ఎయిర్ సిటీస్” జాతీయ ర్యాంకింగ్‌లో అగ్రస్థానంలో నిలిచింది.
భారతదేశంలో అత్యంత కాలుష్యం లేని నగరం ఏది?
భారతదేశంలో అత్యల్ప కాలుష్య నగరాలు ఐజ్వాల్ మరియు గ్యాంగ్‌టక్. అత్యల్ప కాలుష్య నగరాలు ఎక్కువగా కర్ణాటకలో ఉన్నాయి.
భారతదేశంలో సురక్షితమైన గ్రామం ఏది?
భారతదేశంలోని నాగాలాండ్‌లోని ఖోనోమా అనే గ్రామం నిజాయితీకి మరియు నేర రహిత రికార్డుకు ప్రసిద్ధి చెందింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Pakistan: పాకిస్థాన్‌కు ఆగిపోయిన నిధులు, టర్కీతో విభేదాలు