హైదరాబాద్ : రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా.. ఆర్థిక సాయం పొందుతున్న లబ్ధిదారులకు ప్రభుత్వం కీలకమైన అలర్ట్ జారీ చేసింది. ఆధార్ వివరాలు సరిగా లేని కారణంగా సుమారు 30 శాతం మందికి చెల్లింపులు ఆగిపోయాయి. దీంతో వారికి ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చింది. వారు రెండు రోజుల్లో ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలను సరిచేసుకోవాలని తెలి పింది. ఈ ప్రక్రియ పూర్తయితే లబ్దిదారుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయడం సులభమవు తుందని చెప్పుకొచ్చింది. ఆ వివరాలు.. రాష్ట్రంలో సొంతిల్లు లేని పేదవారి కోసం రేవంత్ సర్కార్ ఇందిరమ్మ ఇళ్లు పథకాన్ని (Indiramma Illu Scheme) అమలు చేస్తోంది. అర్హు లైన వారిన ఎంపిక చేసి వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తోంది. ఇల్లు కట్టుకోవడానికి జాగా లేని వారికి ప్రభుత్వమే స్థలం కేటాయిస్తుంది. ఇప్పటికే తొలివిడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశారు. ఇప్పుడు రెండో విడత లబ్దిదారులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు.
ఇంటి నిర్మాణం వివిధ దశలకుఅనుకూలంగా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం
అయితే తొలి విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల్లో కొందరికి చెల్లింపులు ఆగిపోయాయి. వారికి ప్రభుత్వం కీలక అలర్ట్ జారీ చేసింది. రెండు రోజులు అవకాశం ఇచ్చింది. ఆ వివరాలు.. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల్లో కొందరికి చెల్లింపులు నిలిచిపోయాయి. లబ్ధిదారులు బ్యాంక్ ఖాతా నంబర్లకు ఆధార్ లింక్ లేకపోవడం, రెండు కార్డుల్లో వివరాలు సరిపోలకపోవడం వంటి సమస్యల కారణంగా తొలి విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల్లో (First phase of Indiramma houses) సుమారు 30 శాతం మందికి చెల్లిం పులు ఆగిపోయాయి. వీరికోసం ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ లబ్దిదారులు వారి ఆధార్ కార్డుల్లో తప్పులు ఉంటే సరి దిద్దుకు నేందుకు చివరి అవకాశం ఇచ్చింది. ఈమేరకు హౌసింగ్ సెక్రటరీ వీపీ గౌతమ్ తాజాగా దీని గురించి కలెక్ట ర్లకు సర్క్యులర్ జారీ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధి దారులకు ఇకపై డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్) ద్వారా చెల్లింపులు జరుగుతాయని అధికారులు తెలిపారు.

వివరాలను సేకరించి
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ఇండియా (ఎన్పీసీఐ), ఏపీబీఎస్ (ఆధార్ పేమెంట్ బ్రిడ్జి సిస్టం) ద్వారా డబ్బులు చెల్లిస్తారు. దీంతో లబ్దిదారుల జాబితాలో.. ఆధార్‌కార్డుల్లో తప్పులున్న వారి వివరాలను సేకరించి సరిచేయాలని కలెక్టర్లకు వీపీ గౌతమ్ ఆదేశాలు జారీ చేశారు. పేర్లు, ఆధార్ నంబర్లను అప్డేట్ చేయాలని చెప్పారు. దీని కోసం ఆధార్ హెల్ప్ లైన్ నంబర్లు, సిబ్బంది సహాయం తీసు కోవాలని తెలిపారు. పేర్ల మార్పు కోసం ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు రెండు రోజుల సమయం ఇచ్చారు. ‘ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లలో పేర్లు మార్చుకునేందుకు రెండు రోజులపాటు అవకాశం ఇచ్చామని‘ వీపీ గౌతమ్ తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత పంచాయతీ సెక్రటరీ, వార్డ్ ఆఫీసర్ లాగిన్‌లో కొత్త వివరాలు కనిపి స్తాయని, ఆ తర్వాత లబ్దిదారులు ఖాతాల్లో డబ్బు లు జమ చేయడం సులభమవుతుందని తెలి పారు. ఈక్రమంలో లబ్ధిదా రులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తమ వివరాలను సరి చేసుకోవాలని సూచించారు.
ఈ స్కీమ్ ప్రారంభమైనది ఎప్పుడు?
ఈ స్కీమ్ 2006–2007 కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభమై, తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కొనసాగించబడింది.
ఈ స్కీమ్ ద్వారా ఇళ్లను ఎలా పొందవచ్చు?
ప్రభుత్వం దరఖాస్తులను ఆన్లైన్ లేదా స్థానిక పరిషత్ కార్యాలయాల ద్వారా స్వీకరించి, అర్హులైన కుటుంబాలకు ఇళ్లను కేటాయిస్తుంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: