ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF)లో భారత్ తరఫున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ను కేంద్ర ప్రభుత్వం ఆకస్మికంగా తన పదవి నుంచి తొలగించింది. ఈ నిర్ణయం ఆయన పదవీకాలం ఇంకా ఆరు నెలలు మిగిలి ఉండగానే తీసుకోవడం రాజకీయ, ఆర్థిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా ఇది సాధారణ స్థాయి నిర్ణయం కాదని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
భారత్ IMFను ఉద్దేశించి పాకిస్తాన్‌కు నిధులు మంజూరు
ఇటీవల భారత్ IMFను ఉద్దేశించి పాకిస్తాన్‌కు నిధులు మంజూరు చేయవద్దని సూచించింది. ఆ నిధులు ఉగ్రవాద కార్యకలాపాలకు మళ్లే అవకాశం ఉందని భారత్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో, మే 9న IMFలో దీనిపై సమీక్ష జరగనుంది. అలాంటి కీలక సమయంలోనే కృష్ణమూర్తిని తొలగించడం అనేక అనుమానాలకు దారి తీస్తోంది. ఆయన మార్గదర్శకతతో భారత్ గళాన్ని బలంగా వినిపిస్తున్న తరుణంలో తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఏదో మర్మం ఉందని భావిస్తున్నారు.
విధానాల్లో కొన్ని మార్పులు చేయాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం
కేంద్రం ఈ విషయంపై అధికారికంగా పూర్తి వివరణ ఇవ్వకపోయినా, కొందరు నిపుణులు దీన్ని రాజకీయ లేదా అంతర్గత పరిపాలన వ్యూహాల భాగంగా చెబుతున్నారు. మరోవైపు, IMF వంటి అంతర్జాతీయ సంస్థలతో సంబంధాలు, విధానాల్లో కొన్ని మార్పులు చేయాలన్న ఉద్దేశంతోనే ఈ చర్య తీసుకున్నదని మరో వర్గం అభిప్రాయపడుతోంది. ఏది ఏమైనా, భారత్ నిర్ణయం అంతర్జాతీయ వేదికపై ప్రభావం చూపనుంది. మే 9 సమీక్షలో భారత్ కొత్త ప్రతినిధి ఎలాంటి నడవడి అవలంబిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది.
Read Also : Pakistan : మళ్లీ కవ్వింపు చర్యలకు దిగిన పాక్