ప్రపంచ బ్యాంక్ (World Bank) తాజా నివేదిక ప్రకారం, భారత్ 2025-26 ఆర్థిక సంవత్సరంలో 6.3% వృద్ధి రేటు సాధించే అవకాశం ఉంది. ఇది ముందస్తు అంచనాల కంటే తక్కువగా ఉండడం గమనార్హం. అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో ఎగుమతులపై ఒత్తిడి పడే అవకాశం ఉన్నా, ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తుందని బ్యాంక్ (World Bank) తెలిపింది. 6.7% వృద్ధిరేటు లభించొచ్చని ఈ ఏడాది జనవరిలో అంచనా వేసిన ప్రపంచ బ్యాంక్, ఏప్రిల్‌లో దాన్ని 6.3 శాతానికి కుదించింది. తాజాగా రూపొందించిన ‘గ్లోబల్ ఎకనమిక్ ప్రాస్పెక్టస్’ నివేదికలోనూ అదే స్థాయి వద్ద ఉంచింది. 2026-27లో భారత వృద్ధి రేటు 6.5 శాతంగా నమోదు కావొచ్చని పేర్కొంది.
గత అంచనాల నుండి తగ్గింపు
జనవరి అంచనా 6.7% కాగా, ఇప్పుడు 0.2% తగ్గించింది. వాణిజ్య ఆందోళనలు, విధానపరమైన అనిశ్చితులు.. ఈ ఏడాది అంతర్జాతీయ వృద్ధిని నెమ్మదించేలా చేసి 2008 స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంక్ తెలిపింది. 2025లో అంతర్జాతీయ వృద్ధి 2.3 శాతంగా నమోదు కావొచ్చని పేర్కొంది. ఈ ఏడాది ప్రారంభంలో అంచనా వేసిన 2.8% కంటే ఇది 0.5% తక్కువ.

ఎగుమతులపై ఒత్తిడి
ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న అనిశ్చితులు, వాణిజ్య ఉద్రిక్తతలు, విధాన మార్పులు భారత ఎగుమతులపై ఒత్తిడిని కలిగించనున్నాయి. ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతుందని ప్రపంచ బ్యాంకు (World Bank) తెలిపింది. వాణిజ్య ఆందోళనలతో అమెరికా వృద్ధి రేటు ఈ ఏడాది 1.4 శాతంగా నమోదు కావొచ్చని ప్రపంచ బ్యాంక్ (World Bank) అంచనా వేసింది. చైనా వృద్ధి రేటు 2025లో 4.5%, 2026లో 4 శాతంగా నమోదు కావొచ్చని తెలిపింది. భారత వృద్ధి రేటు ఇతర దేశాల కంటే మెరుగుగా ఉన్నప్పటికీ, అంచనాల కంటే తగ్గిపోతుండటం ఆందోళనకరం. దీన్ని సమతూలంగా నిర్వహించేందుకు ఆర్థిక విధానాల్లో స్థిరత్వం, విదేశీ పెట్టుబడులకు ప్రోత్సాహం, రఫ్తా ప్రోత్సాహకాలు కీలకంగా మారనున్నాయి.
Read Also: India-US: ఈ నెలలోనే భారత్-అమెరికా మధ్యంతర ట్రేడ్ డీల్!