trump

తనిఖీలతో ఉద్యోగాలు వదిలేస్తున్న భారతీయులు

అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు భారతీయ పార్ట్ టైమర్లకు చుక్కలు చూపిస్తోంది. ముఖ్యంగా స్వదేశం వదిలి మెరుగైన ఉపాధి అవకాశాలు, చదువుల కోసం అగ్రరాజ్యానికి వెళ్లిన వీరంతా ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ఇతర దేశాలతో పోలిస్తే భారీగా అమెరికాకు వెళ్లి పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసుకుంటూ చదువుకుంటున్న భారతీయ విద్యార్థులపై ట్రంప్ ఉరుముతున్నారు. వరుస తనిఖీలతో బెంబేలెత్తిస్తున్నారు. దీంతో వారు ఉద్యోగాలు వదిలేసి పారిపోతున్నారు. అమెరికాలో ఇటీవల విడుదలైన ఓపెన్ డోర్ నివేదికలో అక్కడ మొత్తం 11.26 లక్షల మంది విదేశీ విద్యార్ధులు ఉండగా.. అందులో భారతీయులే 3.30 లక్షల మంది ఉన్నారు. ప్రతీ పది మందిలో ముగ్గురు మనోళ్లే. అందులోనూ తెలుగు వారు ఏకంగా 56 శాతం మంది ఉన్నారని తేలింది. దీంతో వీరందరికీ ఇప్పుడు ట్రంప్ సినిమా చూపించేస్తున్నారు. వీరిని లక్ష్యంగా చేసుకుని అమెరికా అధికారులు జరుపుతున్న తనిఖీలు వీరికి కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి.

క్యాంపస్ లో చదువుకుంటున్న వీరికి అదే క్యాంపస్ లో పార్ట్ టైమ్ ఉద్యోగాలు వారానికి 20 గంటల పాటు చేసుకునే అవకాశం ఉంది. కానీ అందరికీ క్యాంపస్ లో పార్ట్ టైమ్ ఉద్యోగాలు అంటే దొరకవు. కాబట్టి పెట్రోల్ బంకులు, మాల్స్ ఇలా బయట కూడా పనిచేసుకుంటున్నారు. ఇలా క్యాంపస్ లు కాకుండా బయట పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసుకునే వారికి అమెరికన్లకు చెల్లించే దాని కంటే తక్కువే చెల్లిస్తారు. కానీ ఇప్పుడు అక్కడే అధికారులు తనిఖీలు చేస్తున్నారు. వారికి చిక్కితే వీసా రద్దు చేసి ఇంటికి పంపేస్తారు. తిరిగి అమెరికా మాటెత్తే పరిస్ధితి ఉండదు. దీంతో ముందే వారు పార్ట్ టైమ్ ఉద్యోగాలు మానేసి ఇంటికి డబ్బుల కోసం ఫోన్లు చేసుకోవాల్సిన పరిస్ధితులు కనిపిస్తున్నాయి. ఇదంతా చూస్తూ మన కేంద్ర ప్రభుత్వం కూడా ఏమీ చేయలేని పరిస్ధితి.

Related Posts
ముంబయి 26/11 మారణ హోమానికి 16 ఏళ్లు..
16 years

మంబయి: దేశ ఆర్థిక రాజధానిలో మారణ హోమానికి 16 ఏళ్లు. 2008 నవంబర్ 26న సముద్రమార్గం ద్వారా మంబయిలోకి ప్రవేశించిన 10 మంది ఉగ్రవాదులు తాజ్ హోటల్, Read more

కేంద్ర బడ్జెట్‌పై నేడు అఖిలపక్ష సమావేశం
కేంద్ర బడ్జెట్‌పై నేడు అఖిలపక్ష సమావేశం

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభనికి ముందు కేంద్రం గురువారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమవుతాయని, సమావేశాలు సజావుగా సాగేందుకు Read more

కేఎల్ యూనివర్సిటీ ,న్యాక్ అధికారులు అరెస్ట్?ఎందుకంటే..
కేఎల్ యూనివర్సిటీ ,న్యాక్ అధికారులు అరెస్ట్ ఎందుకంటే

న్యాక్ రేటింగ్ కొరకు అక్రమాలకు పాల్పడిన కేఎల్ యూనివర్సిటీ అధికారులతోపాటు న్యాక్ పర్యవేక్షణ బృందం సభ్యులను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కోనేరు Read more

ఈ రోజు సాయంత్రం ఢిల్లీ సీఎం పేరు ప్రకటన..
The name of Delhi CM will be announced this evening

న్యూఢిల్లీ: ఈ రోజు సాయంత్రం ఢిల్లీ సీఎం పేరు ప్రకటన.ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ఎవరనే విషయానికి బుధవారం తెరపడనుంది. బుధవారం మధ్యాహ్నం బీజేఎల్పీ సమావేశం కానుంది. దీంతో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *