Indian Railways Unveils Wor

హైడ్రోజన్ రైల్ ను పరిచయంచేసిన భారత్

భారత్ మరో కీలక ఘట్టాన్ని సాధించింది. తొలిసారిగా 1200 హార్స్పవర్ సామర్థ్యంతో నడిచే హైడ్రోజన్ రైల్ ఇంజిన్‌ను అభివృద్ధి చేసింది. ప్రపంచంలో అమెరికా, చైనా, జర్మనీ వంటి దేశాల వద్ద మాత్రమే ఇలాంటి రైలు ఇంజిన్లు ఉండగా, వాటి సామర్థ్యం 500-600 HPS మధ్యే ఉంటుంది. కానీ భారత్ తయారు చేసిన ఈ హైడ్రోజన్ ఇంజిన్ 140 కిలోమీటర్ల వేగంతో నడవడమే కాక, డీజిల్ లేదా విద్యుత్ అవసరం లేకుండా పనిచేస్తుంది. త్వరలోనే ట్రయల్ రన్ ప్రారంభించనుంది. హైడ్రోజన్ రైళ్లను ప్రపంచం ఫ్యూచర్ ట్రాన్స్‌పోర్ట్‌గా చూస్తోంది. ఈ రైళ్ల ఫ్యూయల్ సెల్స్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది, వాటి ద్వారా ఇంజిన్ నడుస్తుంది. ఇవి పూర్తిగా కాలుష్య రహితమైనవి, వీటి పని సమయంలో బైప్రొడక్ట్‌గా నీటి ఆవిరి మాత్రమే విడుదలవుతుంది. ఇది భారత ప్రభుత్వానికి 2070 నాటికి జీరో ఎమిషన్ టార్గెట్ సాధించడంలో కీలక పాత్ర పోషించనుంది.

హైడ్రోజన్ రైళ్ల మరొక ముఖ్యమైన ప్రయోజనం ఎలక్ట్రిఫికేషన్ లేకుండా ట్రాకులపై నడిచే సామర్థ్యం. ఇది భారత రైల్వేకు అదనపు ప్రాముఖ్యతనిస్తుంది. ఎలక్ట్రికల్ వైరింగ్ అవసరం లేకుండా, డీజిల్ వినియోగం తగ్గడంతో భారీగా ఖర్చు ఆదా అవుతుంది. గ్రామీణ మరియు వెనుకబడి ప్రాంతాల్లోనూ ఈ రైళ్లు ఆపరేట్ చేయగలవు.

హైడ్రోజన్ రైళ్లను వినియోగంలోకి తేవడం ద్వారా రైల్వే వ్యవస్థ ఆర్థికంగా మేలు పొందుతుంది. డీజిల్ ఆధారిత ఇంధనాలపై వ్యయం తగ్గిపోవడమే కాక, పర్యావరణానికి హాని కలిగించే ఎమిషన్లు తగ్గుతాయి. వీటితో పాటు భారత ఆవిష్కరణ ప్రపంచ దృష్టిని ఆకర్షించడంలో సహాయపడుతుంది. భారత్ తయారుచేసిన హైడ్రోజన్ రైలు ఇంజిన్ తన అత్యున్నత టెక్నాలజీ సామర్థ్యాన్ని నిరూపించింది. ప్రపంచంలోని ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా, మరింత వేగంగా సాగడానికి భారత్ సిద్ధమైందని ఈ ప్రాజెక్ట్ స్పష్టం చేస్తోంది. ఇది దేశీయ అభివృద్ధిలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించనుంది.

Related Posts
అంబేద్కర్‌అభయ హస్తం ఎక్కడ..? కాంగ్రెస్ కు కేటీఆర్ సూటి ప్రశ్న
KTR direct question to Cong

తెలంగాణలో ప్రజల స్వేచ్ఛను కాంగ్రెస్ పార్టీ హరిస్తున్నట్లు పేర్కొన్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిండేట్ కేటీఆర్.. కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నేడు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ Read more

మళ్లీ వార్తల్లోకి వచ్చిన ముద్రగడ
mudragada

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి వార్తల్లో నిలిచాడు. అప్పట్లో ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ వార్తల్లో నిలిచినా Read more

‘అన్న క్యాంటీన్‌’ పేరుతో ఛారిటబుల్‌ ట్రస్టు
‘అన్న క్యాంటీన్‌’ పేరుతో ఛారిటబుల్‌ ట్రస్టు

ఆంధ్రప్రదేశ్‌లో అన్న క్యాంటీన్లకు విరాళాలపై ఆదాయ పన్ను మినహాయింపును కల్పిస్తూ కొత్త ఛారిటబుల్ ట్రస్ట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద Read more

10,౦౦౦ మందికి కాగ్నిజెంట్ ఉద్వాసన!
10,౦౦౦ మందికి కాగ్నిజెంట్ ఉద్వాసన!

కరోనా లాక్ డౌన్ సమయంలో ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఈ ఉద్యోగాల కొత ఐటి పరిశ్రమను కూడా తాకింది. పరిస్థితులు కోవిడ్ నుండి సాధారణ స్థాయికి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *