కెనడా(Canada)లోని అల్బెర్టాలో జూన్ 15 నుంచి 17 వరకు జరగనున్న G7 సదస్సుకు(G7 summit) భారత్‌కు ఆహ్వానం అందకపోవడం, రెండు దేశాల మధ్య ఉన్న క్షీణ సంబంధాలను ప్రతిబింబిస్తుంది.

ఈ నెల 15 నుంచి 17 వరకు ఈ సమ్మిట్ జరగనుంది. కానీ ఆహ్వానం (an invitation)అందకపోవడంతో ఆరేళ్లలో తొలిసారి ఈ సదస్సుకు ప్రధాని మోడీ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. భారత్-పాక్‌ల మధ్య మధ్యవర్తిత్వం చేయడానికి అమెరికాను అనుమతించిన తర్వాత ఇది మన దేశానికి జరిగిన మరో దౌత్యపరమైన భంగపాటేనని కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది.
దౌత్యపరంగా ఇదో భంగపాటే
ఈ అంతర్జాతీయ సదస్సులో అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, జపాన్, ఇటలీ, కెనడాతో పాటు జర్మనీ అధినేతలు పాల్గొననున్నారని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. అలానే బ్రెజిల్, మెక్సికో, దక్షిణాఫ్రికా, ఉక్రెయిన్, ఆస్ట్రేలియా దేశాధినేతలకు కూడా ఆహ్వానం అందిందని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ వెల్లడించారు. 2014కు ముందుకు జీ8 గా ఉండేదని.. అప్పుడు నాటి ప్రధాని మన్మోహన్‌కు కూడా ఆహ్వానం వచ్చేదన్నారు. 2014 తర్వాత కూడా ఈ సంప్రదాయం కొనసాగినప్పటికీ.. ఆరేళ్లలో తొలిసారి మన ప్రధానికి ఆహ్వానం అందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ విధంగా చూసిన కూడా దౌత్యపరంగా ఇదో భంగపాటేనని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.భారత ప్రభుత్వం ఈ వ్యవహారంపై అధికారికంగా స్పందించలేదు. అయితే, ఈ అంశం దేశీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
Read Also : Israel: గాజాలో మానవీయ విపత్తు..సహాయ కేంద్రాల మూసివేత