అత్యంత శక్తివంతమైన ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ (India missile) సిస్టమ్ అదనపు యూనిట్స్‌ని రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకోనున్నట్లు తెలుస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్, పీవోకేలోని తొమ్మిది ఉగ్రస్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. అనంతరం పాకిస్తాన్ భారత్‌పై డ్రోన్లు, మిస్సైల్స్(India missile)దాడికి ప్రయత్నించింది. ఆ సమయంలో సరిహద్దుల్లో మోహరించిన ఎస్-400 మిస్సైల్ సిస్టమ్ (India missile) విజయవంతంగా అడ్డుకుంది. S-400 అనేది మొబైల్ మిస్సైల్ వ్యవస్థ. వాహనాల ద్వారా వీటిని ఎక్కడినుంచి ఎక్కడికైనా తరలించవచ్చు. ప్రత్యర్థుల జామింగ్ సిస్టమ్‌ని తట్టుకునే సామర్థ్యం దీని సొంతం. శత్రు దేశాలు ప్రయోగించే యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులను అత్యంత కచ్చితత్వంతో నేల కూలుస్తుంది. భారత్ దగ్గర మొత్తం మూడు S-400 వ్యవస్థలు ఉన్నాయి. భారత్ తన వైమానిక రక్షణ సామర్థ్యాన్ని మరింత విస్తరించేందుకు నిర్ణయం తీసుకుంది.

రష్యా నుంచి మరిన్ని యూనిట్లపై భారత్ అభ్యర్థన
భారత్ విజ్ఞప్తికి రష్యా అంగీకారం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రష్యాలో తయారు చేసిన S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను భారత్‌లో ‘సుదర్శన్ చక్రం’గా పిలుస్తున్నారు. ఎస్-400 ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన మొబైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. దీన్ని సులభంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించేందుకు అవకాశం ఉంటుంది. దాన్ని ఓ వాహనంపై అమర్చవచ్చు. ఒకేసారి మల్టిపుల్ టార్గెట్స్‌ని ధ్వంసం చేస్తుంది. రష్యాలో తయారైన ఈ వ్యవస్థను భారత్‌లో ‘సుదర్శన చక్రం’గా అభివర్ణిస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో, భారత్ తన ఎయిర్ డిఫెన్స్ కవచాన్ని మరింత బలపరిచేందుకు మరిన్ని యూనిట్లు కోరింది. రష్యా ఈ విజ్ఞప్తిని అంగీకరించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.భారత్ S-400 మిస్సైల్ సిస్టమ్ లాంటి టెక్నాలజీ ఆధారిత రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేస్తూ, తన భద్రతా పటిష్టతను స్థిరంగా పెంచుకుంటోంది. ప్రస్తుత భూగోళ రాజకీయ పరిస్థితుల్లో ఇది ఒక వ్యూహాత్మక నిర్ణయంగానే కాక, జాతీయ భద్రతకు బలమైన రక్షణగా నిలుస్తుంది.
Read Also: Mumbai High Alert: ముంబైలో విమానాశ్రయం, తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపులు..