India once again provides 30 tonnes of disaster aid to Myanmar

Earthquake : మయన్మార్‌కు మరోసారి భారత్ 30 టన్నుల విపత్తు సాయం

Earthquake : మయన్మార్, థాయిలాండ్ భారీ భూకంపాలు కుదిపేసిన విషయం తెలిసిందే. పెనువిధ్వంసంతో రెండు దేశాల ప్రజలు గజగజవణికిపోయారు. భూకంపాల ధాటికి మృతుల సంఖ్య గంటకు పెరుగుతోంది. మయన్మార్, థాయిలాండ్ లో మృతిచెందిన వారి సంఖ్య 16వందలకు చేరింది. శిధిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. శుక్రవారం మయన్మార్‌లో భారీ భూకంపం సంభవించగా, శనివారం ప్రధాని మోడీ ఆదేశాల మేరకు భారీ సహాయాన్ని పంపించడం జరిగింది.

Advertisements
మయన్మార్‌కు మరోసారి భారత్ 30 టన్నుల

ఈ కార్యక్రమానికి ‘ఆపరేషన్ బ్రహ్మ’గా నామకరణం

ఆదివారం కూడా 30 టన్నుల విపత్తు సహాయాన్ని తరలించారు. వివిధ రకాల ఆహార వస్తువులతో పాటు వైద్య సామాగ్రిని యాంగోన్‌కు పంపించారు. భారత నావికాదళ నౌకలు ఐఎన్ఎస్ కర్మూక్, ఎల్ సీ యూ 52 లలో 30 టన్నుల సాయాన్ని పంపినట్లు విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. బాధిత దేశానికి సహాయం అందించే ఈ కార్యక్రమానికి ‘ఆపరేషన్ బ్రహ్మ’గా నామకరణం చేశారు. ఆపరేషన్ బ్రహ్మ కొనసాగుతోందని కేంద్ర మంత్రి తెలిపారు.

భూ ఉపరితలానికి 10 కి.మీ లోతులోనే భూకంప కేంద్రాలు

మయన్మార్‌ మళ్లీమళ్లీ ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. పెద్దఎత్తున భవనాలు, మౌలిక సదుపాయాలు దెబ్బతింటున్నాయి. భూ ఉపరితలానికి 10 కి.మీ లోతులోనే భూకంప కేంద్రాలు ఉన్నాయని అమెరికా భూ వైజ్ఞానిక సర్వే సంస్థ వెల్లడించింది. మృతుల సంఖ్య 10 వేలు దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇప్పటివరకు 1,644 మందికి పైగా మృతులను గుర్తించారు. మాండలే వీధుల్లో మృతదేహాలు కుళ్లిపోతుండటంతో దుర్గంధం వెలువడుతోంది. మండుటెండలో ఉత్త చేతులతో, చిన్నచిన్న పారలతో శిథిలాలను తొలగిస్తూ, ఎవరైనా ప్రాణాలతో ఉన్నారేమో తెలుసుకునేందుకు ప్రజలు ప్రయత్నిస్తున్నారు.

Related Posts
Ashwini Vaishnaw : 1410 గేమింగ్ సైట్లను నిషేధించిన కేంద్రం
Ashwini Vaishnaw 1410 గేమింగ్ సైట్లను నిషేధించిన కేంద్రం

Ashwini Vaishnaw : 1410 గేమింగ్ సైట్లను నిషేధించిన కేంద్రం ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.ఈ అంశానికి సంబంధించి రాష్ట్రాలు తమ Read more

అమెరిక‌న్ మ‌ద్యంపై భార‌త్ 150 శాతం సుంకం: వైట్‌హౌజ్
India imposes 150 percent tariff on American liquor: White House

న్యూయార్క్ : భారత్‌పై శ్వేత సౌధం కీల‌క ఆరోప‌ణ చేసింది. అమెరికా మ‌ద్యం, వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌పై భార‌త్ అధిక స్థాయిలో సుంకాలు వ‌సూల్ చేస్తున్న‌ట్లు చెప్పింది. అమెరిక‌న్ Read more

హై కోర్టును బురిడీ కొట్టించిన బోరుగడ్డ అనిల్ కుమార్
Borugadda Anil Kumar Tokara moves High Court with false medical certificate

అమరావతి: బోరుగడ్డ అనిల్ కుమార్ ఏకంగా హైకోర్టును తప్పుదారి పట్టించాడు. తల్లికి అనారోగ్యం అంటూ ఫేక్ డాక్టర్ సర్టిఫికెట్లు సబ్మిట్ చేసి మధ్యంతర బెయిల్ తెచ్చుకున్నాడు. గడువు Read more

Waqf Bill: వక్ఫ్ బిల్లు చుట్టూ ఉన్న వివాదాలు ఏంటి?
వక్ఫ్ బిల్లు చుట్టూ ఉన్న వివాదాలు ఏంటి?

వక్ఫ్ ( సవరణ) బిల్లు 2024 బిల్లును కేంద్ర ప్రభుత్వం ఇవాళ (బుధవారం) లోక్‌సభలో ప్రవేశపెట్టబోతోంది. ఈ బిల్లుపై చర్చకు ఎనిమిది గంటలు కేటాయించామని, అవసరమైతే దీన్ని Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×