ఆస్తి పన్ను బకాయిలపై రాయితీ.. నేటితో ముగియనున్న గడువు

Property Tax: ఆస్తి పన్ను బకాయిలపై రాయితీ.. నేటితో ముగియనున్న గడువు

Property Tax : ఆస్తి పన్ను బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వడ్డీ రాయితీ గడువు నేటితో ముగియనుంది. ఈ నెల 25న 50 శాతం రాయితీ ప్రకటించగా, శనివారం ఒక్క రోజే రూ.60 కోట్లు వచ్చాయి. మొత్తంగా పట్టణ, స్థానిక సంస్థల్లో గత ఐదు రోజుల్లో రూ.204 కోట్లు వసూలు అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా పన్ను వసూళ్లు గణనీయంగా పెరిగాయి. ఇది నగదు కొరతతో బాధపడుతున్న మున్సిపల్ సంస్థలకు పెద్ద ఊరటనిస్తోంది. 26వ తేదీన రూ.32 కోట్లు, 27వ తేదీన రూ.40 కోట్లు, 28వ తేదీన రూ.38 కోట్లు, 29వ తేదీన రూ.60 కోట్లు, 30వ తేదీన రూ.34 కోట్లు వసూలు అయ్యాయి.

Advertisements
ఆస్తి పన్ను బకాయిలపై రాయితీ.. నేటితో ముగియనున్న గడువు

ఈరోజు సెలవు అయినా పన్ను వసూళ్లు

రంజాన్‌ కారణంగా ఈరోజు సెలవు అయినా పన్ను వసూళ్లకు వీలుగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అధికారులు అందుబాటులో ఉంటారు. నిన్న ఉగాది పండుగ కావడంతో ఎక్కువ మంది పన్ను చెల్లింపులు చేయలేకపోయారు. అయితే ఇవాళ ప్రజలు భారీగా వచ్చే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. కాగా ఆస్తి పన్నుపై 50 శాతం వడ్డీ మాఫీపై మున్సిపల్ అధికారులు భారీ అవగాహన కార్యక్రమాలను చేపట్టారు.

మరో రూ.15 కోట్లు వసూలవుతుందని అంచనా

కాగా, మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలో ఆస్తి పన్ను వసూళ్లు రికార్డుస్థాయికి చేరాయి. గతంలో ఎన్నడూలేనంతగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.478.63 కోట్లు వసూలైంది. సోమవారం వరకు గడువుండడంతో మరో రూ.15 కోట్లు వసూలవుతుందని అంచనా వేస్తున్నారు. జీవీఎంసీ చరిత్రలో ఇదే అత్యధిక వసూలని రెవెన్యూశాఖ అధికారులు పేర్కొనడం విశేషం.

Related Posts
B.R. Ambedkar: అంబేద్కర్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ నివాళి
B.R. Ambedkar: అంబేద్కర్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ నివాళి

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ట్యాంక్‌బండ్ Read more

Solar Eclipse: ఏ ఏ దేశాల్లో సూర్యగ్రహణం?
Solar Eclipse: 2025 తొలి సూర్యగ్రహణం - ఏ దేశాల్లో కనిపిస్తుంది?

కొత్త ఏడాది ప్రారంభంలోనే ఖగోళ ప్రియులకు ఆసక్తికరమైన సంఘటన జరగబోతోంది. 2025లో తొలి సూర్యగ్రహణం ఈ నెల 29న ఏర్పడనుందని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ గ్రహణం Read more

జూనియర్ ఎన్టీఆర్ వాణిజ్య ప్రకటనకు అనూహ్య స్పందన
జూనియర్ ఎన్టీఆర్ వాణిజ్య ప్రకటనకు అనూహ్య స్పందన

పాన్ ఇండియా స్థాయిలో ఎన్టీఆర్ క్రేజ్ రోజురోజుకు పెరుగుతోంది.ఆర్ఆర్ఆర్ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్. ప్రస్తుతం ‘వార్ 2’ సినిమాలో నటిస్తూ బిజీగా Read more

ఉపఎన్నికలకు సిద్ధంగా ఉండండి : కేటీఆర్..!
KTR

హైదరాబాద్‌: ఉపఎన్నికలకు సిద్ధంగా ఉండాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. సోమవారం ఫిరాయింపులపై విచారణ సందర్భంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×