Ashwini Vaishnaw 1410 గేమింగ్ సైట్లను నిషేధించిన కేంద్రం

Ashwini Vaishnaw : 1410 గేమింగ్ సైట్లను నిషేధించిన కేంద్రం

Ashwini Vaishnaw : 1410 గేమింగ్ సైట్లను నిషేధించిన కేంద్రం ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.ఈ అంశానికి సంబంధించి రాష్ట్రాలు తమ స్వంత చట్టాలను రూపొందించుకునే హక్కు ఉందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ లోక్‌సభలో వెల్లడించారు.గేమింగ్ బెట్టింగ్‌ను నియంత్రించేందుకు కేంద్రం కూడా చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

Ashwini Vaishnaw 1410 గేమింగ్ సైట్లను నిషేధించిన కేంద్రం
Ashwini Vaishnaw 1410 గేమింగ్ సైట్లను నిషేధించిన కేంద్రం

తమిళనాడు ఆన్‌లైన్ గేమింగ్ నిషేధం – కేంద్రంపై ప్రశ్నలు

డీఎంకే ఎంపీ దయానిధి మారన్ ఈ అంశంపై కేంద్రాన్ని నిలదీశారు.తమిళనాడు ప్రభుత్వం ఆన్‌లైన్ గేమింగ్‌ను నిషేధించిందని, అయితే కేంద్రం మాత్రం తన బాధ్యతల నుంచి తప్పించుకుంటోందా? అని ప్రశ్నించారు.ఈ వ్యాఖ్యలకు స్పందించిన అశ్వినీ వైష్ణవ్, “కేంద్రం నైతిక బాధ్యత నుంచి తప్పించుకోవడం లేదు.నైతికతను ప్రశ్నించే హక్కు ఎవరికి లేదు.రాజ్యాంగం రాష్ట్రాలకు చట్టాలు రూపొందించుకునే అధికారం ఇచ్చింది.అందుకే ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలి” అని స్పష్టం చేశారు.ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్‌కు సంబంధించిన ఫిర్యాదుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు 1410 గేమింగ్ వెబ్‌సైట్లను నిషేధించిందని అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.భవిష్యత్తులోనూ ఈ అంశంపై మరింత కఠినంగా వ్యవహరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

రాష్ట్రాల పరిధిలోనే గేమింగ్, బెట్టింగ్ చట్టాలు

ఈ అంశంపై చట్టాలు రూపొందించేందుకు రాష్ట్రాలకు పూర్తి అధికారం ఉందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.సమాఖ్య నిర్మాణాన్ని అర్థం చేసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వాలే ఈ విషయాన్ని చట్టపరంగా నియంత్రించాలంటూ సూచించారు.కేంద్రం చేసిన తాజా ప్రకటనతో ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్‌పై రాష్ట్ర ప్రభుత్వాలు మరింత చురుగ్గా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.ముఖ్యంగా ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు గేమింగ్ నిషేధానికి చట్టపరమైన చర్యలు తీసుకున్నాయి.మరిన్ని రాష్ట్రాలు ఈ దిశగా అడుగులు వేయనున్నాయా? అన్నదే ఆసక్తికరంగా మారింది.

Related Posts
పోలీసులకు జగన్ వార్నింగ్
jagan warning

పోలీసులు టోపీపై ఉన్న మూడు సింహాలకు సెల్యూట్ కొట్టాలని జగన్ సూచించారు. ఇలా అమ్ముడుపోయి ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడం పోలీసులుగా వృత్తిని కించపరచడమే అవుతుందన్నారు. ఎల్లకాలం ఇదే Read more

తెలియని వ్యక్తులపై రంగు చల్లితే కఠిన చర్యలు -సీపీ
holi

హోలీ సందర్భంగా ప్రజలు మర్యాదపూర్వకంగా సంబరాలు జరుపుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సూచించారు. రోడ్డుపై వెళ్తున్న తెలియని వ్యక్తులపై రంగులు చల్లడం పూర్తిగా నిషేధించబడిందని Read more

ఢిల్లీ మంత్రి కైలాష్ ఘలోత్ ఆమ్ ఆద్మీ పార్టీ నుండి రాజీనామా
kailash

ఢిల్లీ మంత్రి మరియు ఆప్ నాయకుడు కైలాష్ ఘలోత్ ఆమ్ ఆద్మి పార్టీ (AAP) ప్రాథమిక సభ్యత్వం నుండి రాజీనామా చేశారు. ఈ నిర్ణయం ఆయన ఆమ్ Read more

IPL2025 :కుల్దీప్ ను నెట్టేసిన రిషబ్ పంత్‌
IPL2025 :కుల్దీప్ ను నెట్టేసిన రిషబ్ పంత్‌

ఐపీఎల్ 2025 సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్ జి) ఒక వికెట్ తేడాతో ఓటమి పాలైంది.ఐపీఎల్ 2025 Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *