అమరావతి: బోరుగడ్డ అనిల్ కుమార్ ఏకంగా హైకోర్టును తప్పుదారి పట్టించాడు. తల్లికి అనారోగ్యం అంటూ ఫేక్ డాక్టర్ సర్టిఫికెట్లు సబ్మిట్ చేసి మధ్యంతర బెయిల్ తెచ్చుకున్నాడు. గడువు ముగియడంతో మరోసారి తల్లికి అనారోగ్యం కారణం చూపించి రెండోసారి బెయిల్ తెచ్చుకున్నాడు. అనుమానం వచ్చి చెక్ చేయగా అది ఫేక్ డాక్టర్ సర్టిఫికేట్ అని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. హైకోర్టు బెల్ మంజూరు చేసిన తర్వాత డాక్యుమెంట్లు పూర్తిస్థాయిలో చెక్ చేయకుండా బూరుగడ్డ అనిల్ కుమార్ ను అంత ఈజీగా ఎలా రిలీజ్ చేశారని విమర్శలు వస్తున్నాయి.

ఏపీ వ్యాప్తంగా సుమారు 14 కేసులు
వైసీపీ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, వారి కుటుంబాల టార్గెట్ గా గుంటూరుకు చెందిన బూరుగడ్డ అనిల్ కుమార్ చెలరేగిపోయాడు. బరుగడ్డపై ఏపీ వ్యాప్తంగా సుమారు 14 కేసులు నమోదయ్యాయి. ఓ వ్యక్తిని కత్తితో బెదిరించి అత్యాయత్నం చేసిన కేసులో అరండల్ పేట పోలీసులు గత ఏడాది అక్టోబర్ నెలలో బోరుగడ్డ అనిల్ కుమార్ ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైల్లో బోరుగడ్డ అనిల్ రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.
తల్లి అనారోగ్యంపై మెడికల్ సర్టిఫికెట్
ఈ క్రమంలో తన తల్లికి అనారోగ్యంగా ఉందని ఆమె గుండె జబ్బు ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతోందని చికిత్స చేయించేందుకు తనకు బెయిల్ మంజూరు చేయాలని ఫిబ్రవరి 14న హైకోర్టుకు వెళ్ళాడు. తల్లి పద్మావతికి ఉన్న అనారోగ్యంపై మెడికల్ సర్టిఫికెట్ సైతం సబ్మిట్ చేశాడు. బోరుగడ్డ అనిల్ పిటిషన్ లంచ్ మోషన్ గా స్వీకరించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే శ్రీనివాస్ రెడ్డి నిందితుడికి ఫిబ్రవరి 15 నుంచి 28వ తేదీ వరకు మద్యంతర బెయిల్ మంజూరు చేశారు. ఫిబ్రవరి 28న సాయంత్రం 5 గంటల వరకు లొంగిపోవాలని సైతం ఆదేశాలలో పేర్కొన్నారు.