India-China : భారత్-చైనా సంబంధాలపై జిన్‌పింగ్ అభిప్రాయం మధ్య దౌత్య సంబంధాలకు ఈ ఏడాది 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇరు దేశాల నాయకులు పరస్పరం అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రత్యేక సందేశాన్ని పంపారు. భారత్-చైనా బంధాన్ని మరింత బలపర్చుకునేందుకు కలిసి పనిచేయాలని ఆయన సూచించారు.జిన్‌పింగ్ మాట్లాడుతూ “భారత్-చైనా సంబంధాలు ద్వైపాక్షికంగా మరింత మెరుగుపడాలని స్నేహపూర్వక సహకారం కొనసాగించాలని” అన్నారు.అంతేకాకుండా “మన బంధం ఏనుగు-డ్రాగన్ టాంగోలా అభివృద్ధి చెందాలి” అంటూ ఆకాంక్ష వ్యక్తం చేశారు.అంతర్జాతీయ వ్యవహారాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవడం ద్వారా సరిహద్దుల్లో శాంతి స్థాపనకు కృషి చేయాలని సూచించారు.చైనా అధ్యక్షుడి అభినందనలతో పాటు, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా చైనా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సహకారం మరింత విస్తరించాలని, ద్వైపాక్షిక సంబంధాలను కొత్తస్థాయికి తీసుకెళ్లేందుకు కలిసి పనిచేయాలని ఆమె పేర్కొన్నారు.ఇదిలా ఉండగా, ఇటీవల బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షుడు మహమ్మద్ యూనస్ నాలుగు రోజులపాటు చైనాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన భారత్‌పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బీజింగ్‌లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ అయిన యూనస్, రెండు దేశాల మధ్య తొమ్మిది కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు.అయితే ఈ చర్చల సమయంలో భారతదేశంలోని ఏడు ఈశాన్య రాష్ట్రాల గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ఆయన వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏమిటనేదానిపై విశ్లేషకులు విస్తృతంగా చర్చిస్తున్నారు.భారత్-చైనా సంబంధాలు గతంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నా, ప్రస్తుతం ఆర్థిక మరియు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంచుకునే దిశగా రెండు దేశాలు కృషి చేస్తున్నాయి. ముఖ్యంగా సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవడం, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడం వంటి అంశాలు కీలకంగా మారాయి.భవిష్యత్తులో ఇరు దేశాలు ఉమ్మడిగా సహకరిస్తే, ఆసియా ఖండంలో శాంతి, స్థిరత నెలకొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.