हिन्दी | Epaper
మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్

IND vs NZ: సచిన్‌, కోహ్లికే సాధ్యం కానీ ఘనత.. చరిత్ర సృష్టించిన జైస్వాల్!

Divya Vani M
IND vs NZ: సచిన్‌, కోహ్లికే సాధ్యం కానీ ఘనత.. చరిత్ర సృష్టించిన జైస్వాల్!

భారత యువ క్రికెటర్ యశస్వీ జైస్వాల్ క్రికెట్ ప్రపంచంలో అరుదైన ఘనతను సాధించాడు. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లిలకు సాధ్యం కాని ఘనతను ఆయన అందుకున్నాడు. యశస్వీ, 23 ఏళ్ల లోపు ఓ క్యాలెండర్ ఇయర్‌లో టెస్టుల్లో 1000+ పరుగులు చేసిన తొలి భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు
పుణే వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో ఈ రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. 2024లో 10 టెస్టు మ్యాచ్‌ల్లో 59.23 సగటు, 75.88 స్ట్రైక్ రేట్‌తో 1007 పరుగులు చేసిన యశస్వీ, రెండు సెంచరీలు, ఆరు అర్ధసెంచరీలు నమోదు చేశాడు. ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా జో రూట్ (1305 పరుగులు) తర్వాత నిలిచాడు.

ఈ విజయంతో యశస్వీ 23 ఏళ్లలోపు టెస్టుల్లో 1000+ పరుగులు చేసిన ఐదో క్రికెటర్‌గా నిలిచాడు. ఈ ఘనత గతంలో నలుగురు మాత్రమే సాధించారు. 1958లో గార్ఫీల్డ్ సోబెర్స్ 1193 పరుగులు చేయగా, 2003లో గ్రేమ్ స్మిత్ 1198, 2005లో ఏబీ డివిలియర్స్ 1008, 2006లో అలెస్టర్ కుక్ 1013 పరుగులు చేశారు. ఇప్పుడు జైస్వాల్ కూడా ఈ లిస్టులో చేరాడు ఇక, భారత్ తదుపరి టెస్టులు ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగా, జైస్వాల్ ఈ అవకాశాన్ని ఉపయోగించి మరిన్ని రికార్డులు సాధించే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే సోబెర్స్ తదితర దిగ్గజాలను అధిగమించే అవకాశం కూడా ఉంది.

మ్యాచ్ విషయానికి వస్తే, భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 45.3 ఓవర్లలో 156 పరుగులకు ఆలౌటైంది. రవీంద్ర జడేజా 38 పరుగులతో టాప్ స్కోరర్ కాగా, జైస్వాల్ 30, శుభ్‌మన్ గిల్ 30 పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ శాంట్నర్ ఏడు వికెట్లతో దూకుడు ప్రదర్శించాడు. ఫిలిప్స్ రెండు వికెట్లు తీయగా, సౌథీ ఒక్క వికెట్ తీశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 259 పరుగులు చేసి, 103 పరుగుల ఆధిక్యం సాధించింది.

    గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

    📢 For Advertisement Booking: 98481 12870