టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది. ఐదు టెస్ట్‌ల సచిన్-అండర్సన్ ట్రోఫీలో భాగంగా లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ కోసం భారత జట్టు తుది జాబితాను ప్రకటించింది. అయితే ఈ మ్యాచ్‌లో కూడా కుల్దీప్ (Kuldeep Yadav) కు అవకాశం లభించలేదు. గత రెండు టెస్టుల పాటు బెంచ్‌కే పరిమితమైన అతనికి ఈ మ్యాచ్ ద్వారా ఆడే అవకాశం కలుగుతుందని భావించారు. కానీ చివరి నిమిషంలో జట్టులో చోటు దక్కలేదు.ఈ మ్యాచ్‌లో టీమిండియా ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగింది. జస్‌ప్రీత్ బుమ్రా కోసం తొలి రెండు టెస్ట్‌ల్లో విఫలమైన ప్రసిధ్ కృష్ణ (Prasidh Krishna) పై టీమిండియా మేనేజ్‌మెంట్ వేటు వేసింది. వాస్తవానికి ఈ మ్యాచ్‌కు కుల్దీప్ యాదవ్ తీసుకుంటారని ప్రచారం జరిగింది.అతని వేరియేషన్, వికెట్ టేకింగ్ సామర్థ్యం జట్టుకు ఉపయోగపడుతుందని అంతా భావించారు.
మాజీ క్రికెటర్లు
అంతేకాకుండా తొలి రెండు టెస్ట్‌ల్లో స్పిన్నర్లు దారుణంగా విఫలమయ్యారు. దాంతోనే కుల్దీప్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని మాజీ క్రికెటర్లు సూచించారు. కానీ టీమిండియా మేనేజ్‌మెంట్ మాత్రం కుల్దీప్ యాదవ్‌ను పట్టించుకోలేదు. బ్యాటింగ్ డెప్త్ కోసమే వాషింగ్టన్ సుందర్‌ను జట్టులో కొనసాగించింది. అయితే కుల్దీప్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకోకపోవడాన్ని నెటిజన్లు, మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు.టాస్ సందర్భంగా శుభ్‌మన్ గిల్ కూడా కుల్దీప్ యాదవ్ గురించి ఏం చెప్పలేదు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో శుభ్‌మన్ గిల్ (Shubman Gill) టాస్ ఓడిపోయాడు. టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని గిల్ తెలిపాడు. ‘వాస్తవానికి ఈ ఉదయం నేను కాస్త గందరగోళానికి గురయ్యాను. టాస్ గెలిస్తే ఏం తీసుకోవాలో అర్థం కాలేదు. అయితే నేను ముందుగా బౌలింగ్ ఎంచుకునేవాడిని. తొలి సెషన్‌లో పిచ్ నుంచి బౌలర్లకు సహకారం ఉంటుంది.

తుది జట్టులో నుంచి తప్పించాల్సి
గత మ్యాచ్‌లో అందరూ రాణించారు. బౌలర్లు రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఎడ్జ్‌బాస్టన్ వికెట్‌పై 20 వికెట్లు తీయడం సులువైన పనికాదు. మేం ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతున్నాం. ప్రసిధ్ కృష్ణ స్థానంలో జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) తుది జట్టులోకి వచ్చాడు.’అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు. బుమ్రా కోసం ప్రసిధ్‌ను తుది జట్టులో నుంచి తప్పించాల్సి వచ్చిందన్నాడు.తుది జట్లు:భారత్ : యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ఇంగ్లండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్(కెప్టెన్), జేమీ స్మిత్(వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, షోయబ్ బషీర్.
కుల్దీప్ యాదవ్ జీవిత చరిత్ర?
కుల్దీప్ యాదవ్ ఉన్నావ్‌లో జన్మించాడు కానీ ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఒక ఇటుక బట్టీ యజమాని కుమారుడిగా పెరిగాడు . ఒక ఇంటర్వ్యూలో, తన తండ్రి తాను క్రికెట్ ఆడటం కొనసాగించాలని కోరుకున్నాడని, తనను కోచ్ వద్దకు కూడా తీసుకెళ్లాడని వెల్లడించాడు. బౌలింగ్ దిగ్గజాలు వసీం అక్రమ్, జహీర్ ఖాన్‌ల నుండి ప్రేరణ పొందిన అతను ఎడమచేతి వాటం సీమర్ కావాలని కోరుకున్నాడు.
చాహల్ లేదా కుల్దీప్ యాదవ్ ఎవరు బాగా ఆడుతారు?
కుల్దీప్, చాహల్ గణాంక పోలిక,వారి సంఖ్యలను పరిశీలిస్తే, మూడు ఫార్మాట్లలో కుల్దీప్ పైచేయి సాధించాడు . ఇప్పటివరకు, అతను 33 వన్డేలు ఆడి 20.07 సగటుతో 67 వికెట్లు పడగొట్టాడు. ఇంతలో, చాహల్ 34 వన్డేల్లో 25.55 సగటుతో 56 వికెట్లు పడగొట్టాడు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: IND vs ENG: మూడో టెస్ట్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్