Inauguration of AICC new office, Indira Gandhi Bhavan, in Delhi

ప్రారంభమైన ఏఐసీసీ నూతన కార్యాలయం

న్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ పార్టీ కొత్త కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. నూతన భవనానికి ఇందిరాగాంధీ అని నామకరణం చేశారు. దీన్ని పార్టీ అగ్రనేత సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రారంభించారు. కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. 5 అంతస్తుల్లో అత్యాధునిక సౌకర్యాలతో నూతన కార్యాలయాని కాంగ్రెస్‌ నిర్మించింది. దీంతో కాంగ్రెస్ అధ్యక్షుడితో సహా పార్టీల నేతలు, ఆఫీస్ బేరర్ల కార్యాలయాలు ఇందిరాగాంధీ భవన్ కి మారనున్నాయి. ప్రస్తుతం అక్బర్ రోడ్డు 24వ నంబర్ బంగ్లాలో ఏఐసీసీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. గతంలో, కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ బంగ్లాల్లో పార్టీ కార్యాలయాలు ఉండకూడదని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి అనుగుణంగా, వివిధ పార్టీలు తమ సొంత భవనాలు నిర్మించుకున్నాయి. ఐదు దశాబ్దాలుగా అక్బర్ రోడ్డులో కాంగ్రెస్ కార్యకలాపాలు జరుగుతున్నాయి.

1978 నుండి ఇది ఏఐసీసీ కేంద్ర కార్యాలయంగా పనిచేస్తోంది. 9A కోట్లా రోడ్డులో 6 అంతస్తుల్లో అత్యాధునిక సౌకర్యాలతో కాంగ్రెస్ నూతన కార్యాలయాన్ని నిర్మించారు. కోట్లా మార్గ్‌కు ఏఐసీసీ కార్యాలయాన్ని తరలించినా.. అక్బర్ రోడ్డు నుంచి కూడా కార్యకలాపాలు ఉంటాయని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. 2008లో దీన్‌దయాళ్ ఉపాధ్యాయ మార్గ్‌లో కాంగ్రెస్ పార్టీకి కేంద్ర ప్రభుత్వం స్థలం కేటాయించింది. అనంతరం దీన్‌దయాళ్ ఉపాధ్యాయ మార్గ్ నుంచి కోట్లా మార్గ్ వైపు ప్రవేశాన్ని మార్చుకున్నారు. 2009లో కేంద్ర కార్యాలయం నిర్మాణం మొదలు పెట్టారు. 15 ఏళ్ల పాటు ఇందిరాగాంధీ భవన్ నిర్మాణం సాగింది.

Related Posts
CricketNews :పంజాబ్ కింగ్స్ కి బిగ్ షాక్!
CricketNews :పంజాబ్ కింగ్స్ కి బిగ్ షాక్!

పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2025లో తమ తొలి మ్యాచ్‌ను మార్చి 25న గుజరాత్ టైటాన్స్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లో జరగనుంది. పంజాబ్ కింగ్స్ ఈ సీజన్‌లో Read more

3 ప్రధాన సంస్థలతో ఒప్పందాలు- మంత్రి లోకేష్
Agreements with 3 major ins

రాష్ట్రంలో యువతకు ఉద్యోగావకాశాలను పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, ఈ మేరకు వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు సంకల్పించినట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు. ఈ Read more

మహా కుంభమేళాలో విజయ్ దేవరకొండ
మహా కుంభమేళాలో విజయ్ దేవరకొండ

నటుడు విజయ్ దేవరకొండ తన తల్లి మాధవి దేవరకొండతో కలిసి మహా కుంభమేళాలో పాల్గొన్నారు. పవిత్ర జలాల్లో స్నానం చేసి, ప్రత్యేక ప్రార్థనలు చేసిన విజయ్ దేవరకొండ Read more

మహిళా కమాండర్ల వివాదం: భారత సైన్యంలో లింగవాదం కొనసాగుతుందా?
women officers

2020లో భారతదేశంలో మహిళలకు సైన్యంలో కమాండర్లుగా సేవలందించే అనుమతి ఇవ్వబడింది. అయితే, ఈ అనుమతికి నాలుగు సంవత్సరాల తరువాత, భారతదేశపు ఒక ప్రముఖ సైనిక జనరల్ మహిళా Read more