ఉత్తరప్రదేశ్‌లోని (In Uttar Pradesh) మీరట్ సమీప గ్రామం సిమౌలీలో ఓ ఘటన ఊహించని భయాన్ని సృష్టించింది. ఓ రైతు ఇంటి పెరట్లో 100కి పైగా పాములు ఒక్కసారిగా బయటకు రావడంతో గ్రామస్థులు భయంతో వణికిపోయారు.ఈ ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. రైతు మహఫూజ్ సైఫీ తన ఇంటి వద్ద ఓ పామును చూసి చంపాడు. కానీ కొన్ని క్షణాల్లోనే పాములు పెద్ద సంఖ్యలో బయటకు రావడం మొదలైంది.పాములు (Snakes) ఇంటి ర్యాంప్ కింద ఉన్న ఓ గూడెం నుంచి బయటకు వస్తున్నట్టు అనిపించింది. ఒక్కటంటే ఒక్కటి… పాములు వరుసగా బయటకు వచ్చాయి. ఈ దృశ్యం చూసిన ఇరుగుపొరుగు వారంతా భయంతో కేకలు వేయడం మొదలుపెట్టారు.గామవాసులు వెంటనే కర్రలు తీసుకుని దాదాపు 50 పాములను (50 snakes) చంపారు. తరువాత వాటిని ఓ గొయ్యిలో పూడ్చేశారు.

అటవీశాఖ స్పందించలేదంటూ ఆరోపణలు
గ్రామస్థులు ఈ ఘటనపై అటవీశాఖకు పలుమార్లు ఫోన్ చేశామని చెబుతున్నారు. కానీ ఎవరూ స్పందించలేదని గట్టిగా ఆరోపిస్తున్నారు. అయితే, అధికారులు మాత్రం ఎలాంటి సమాచారం రాలేదని అంటున్నారు. ఈ వ్యవహారంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పాముల గూడు కావచ్చన్న నిపుణుల అంచనా
వన్యప్రాణి నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇంటి కింద పాముల గూడు ఉండి ఉండవచ్చు. గుడ్లు తడబడటం వల్ల పాములు ఒక్కసారిగా బయటకు రావచ్చని అంటున్నారు. భయంతో గ్రామస్తులు రాత్రంతా జాగారం చేశారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాములు కదలడం, గ్రామస్తుల భయం… ఇవన్నీ అందులో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Read Also : Ursa : ‘ఉర్సా’ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా? – అమర్నాథ్