గాజాలో హమాస్‌కు చెందిన కీలక సైనిక నాయకుడు మహమ్మద్ సిన్వార్ (Mohammed Sinwar) ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హతమయ్యాడు. ఈ సంఘటనతో హమాస్ కొత్త నాయకుడిగా ఇజ్ అల్-దిన్ అల్-హద్దాద్ (Izz al-Din al-Haddad)పేరును ప్రముఖంగా వినిపిస్తోంది.మే 13, 2025న ఖాన్ యూనస్‌లోని యూరోపియన్ ఆసుపత్రి దగ్గర ఈ దాడి జరిగింది. ఐడీఎఫ్ (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్) 30 సెకన్లలో 50కి పైగా ప్రెసిషన్ ఆయుధాలతో దాడి చేసింది. ఆసుపత్రి భవనం దెబ్బతినకుండా, కిందున్న హమాస్ కమాండ్ సెంటర్‌ను లక్ష్యంగా చేసుకుంది.ఈ దాడిలో సిన్వార్‌తో పాటు మహమ్మద్ షబానా, మెహదీ క్వారాలు కూడా చనిపోయారు. వీరిద్దరూ హమాస్ సీనియర్ మిలిటరీ నేతలే.
అల్-హద్దాద్ – హమాస్‌కు తదుపరి నాయకుడు?
ఇజ్ అల్-దిన్ అల్-హద్దాద్ ప్రస్తుతం హమాస్‌లో అత్యంత సీనియర్ కమాండర్. 2021 నుంచి ఖస్సామ్ బ్రిగేడ్స్‌కు నాయకత్వం వహిస్తున్నారు. 2023లో ఉత్తర గాజా బ్రిగేడ్ చీఫ్‌గా నియమితులయ్యారు.అతను గజాలో ప్రస్తుతం జీవించి ఉన్న ఏకైక హమాస్ బ్రిగేడ్ నేత. ఇజ్రాయెల్ ఇప్పటికే అతని తలపై 7.5 లక్షల డాలర్ల రివార్డు ప్రకటించింది. ఆరు సార్లు హత్యాప్రయత్నాల నుంచి తప్పించుకున్నాడన్న ప్రచారం ఉంది.
తదుపరి లక్ష్యం – అల్-హద్దాద్
అల్-హద్దాద్ అక్టోబర్ 7 దాడికి కీలక ప్లానర్. ప్రస్తుతం బందీల వ్యవహారాలపై ఆధిపత్యం చూపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో, అతను ఇప్పుడు హమాస్‌కి పూర్తి సైనిక నియంత్రణ చేపట్టే అవకాశం ఉంది.ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ స్పందిస్తూ, తదుపరి నువ్వే అని హెచ్చరించారు. ఇది గాజాలో ఉద్రిక్తతను మరింత పెంచే అవకాశముందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
Read Also : Pakistan : చైనా ఆయుధాల డొల్లతనం బయటపడిందన్న నిపుణులు