Imposition of President Rule in Manipur

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధింపు

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్ర హోం శాఖ నోటిఫికేషన్ జారీ

ఇంఫాల్: దేశ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. రాష్ట్రపతి పాలన విధిస్తూ గురువారం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఇటీవలే మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రంలో జాతుల మధ్య ఘర్షణలను ఆయన ప్రేరేపించినట్లు లీకైన ఆడియోలో ఉండటంతో గవర్నర్‌ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. అయితే, తదుపరి ఏర్పాట్లు జరిగేదాకా సీఎంగా కొనసాగాలని బీరెన్‌సింగ్‌ను గవర్నర్‌ కోరారు.

Advertisements
కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

అయితే.. బీరెన్ సింగ్ రాజీనామా అనంతరం ఏ పార్టీ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ఎందుకు ముందుకు రావడం లేదు. నాలుగు రోజులు పూర్తి కావడంతో కేంద్రం రాష్ట్రపతి విధించింది. మణిపూర్ పరిస్థితుల్ని చక్కదిద్దడానికి వేరే ముఖ్యమంత్రిని నియమించడం కన్నా.. కేంద్ర పాలన ఉండటం మంచిదన్న అభిప్రాయంతో రాష్ట్రపతి పాలన విధించారు.

కాగా, సీఎం రాజీనామాను గవర్నర్ అజయ్ కుమార్ భల్లా ఆమోదించారు. అయితే కొత్త ముఖ్యమంత్రి నియామకం వరకు బీరేన్ సింగ్ తాత్కాలికంగా పదవిలో కొనసాగాలని గవర్నర్ సూచించారు. అయితే, రాష్ట్రంలోని పరిస్థితులపై కేంద్రానికి సమగ్ర నివేదిక పంపిన గవర్నర్, అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని సిఫార్సు చేశారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖలో అత్యున్నత స్థాయిలో సమీక్ష జరిపిన అనంతరం.. రాష్ట్రపతి పాలన విధిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.

అసలే రాష్ట్రంలో కొంతకాలంగా ఘర్షణలు, విద్రోహకార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వర్గపోరాటాలు, సామాజిక అశాంతితో అక్కడ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ప్రభుత్వం శాంతి నెలకొల్పేందుకు పలు ప్రయత్నాలు చేసినప్పటికీ, అవి వాస్తవికంగా అమలుకాకపోవడంతో రాజీనామాకు బీరేన్ సింగ్ ఒప్పుకున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Related Posts
Chandrababu Naidu: కేంద్ర జలశక్తి మంత్రితో చంద్రబాబు భేటీ
Chandrababu Naidu: కేంద్ర జలశక్తి మంత్రితో చంద్రబాబు భేటీ

విదేశీ పర్యటన ముగించిన చంద్రబాబు.. ఢిల్లీ పర్యటనలో కీలక సమావేశాలు విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించుకున్న అనంతరం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో Read more

అల్లు అర్జున్ హైకోర్టులో అత్యవసర పిటిషన్
TS High Court 1

అరెస్ట్ నేపథ్యంలో సినీ నటుడు అల్లు అర్జున్ హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే క్వాష్ పిటిషన్ దాఖలు చేశామని, దీనిని అత్యవసరంగా విచారించాలని కోరారు. Read more

రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తా: కేటీఆర్‌ కీలక ప్రకటన..!
Will march across the state. KTR key announcement

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మరో కీలక ప్రకటన చేశారు. పార్టీ కార్యకర్తల ఆకాంక్షల ప్రకారం, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపడతానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం Read more

Amit Shah : దేశ భద్రతకు ముప్పు తలపెట్టే వారిని రానివ్వం: అమిత్‌ షా
Amit Shah దేశ భద్రతకు ముప్పు తలపెట్టే వారిని రానివ్వం అమిత్‌ షా

Amit Shah : దేశ భద్రతకు ముప్పు తలపెట్టే వారిని రానివ్వం: అమిత్‌ షా భారతదేశం ఓ ఆశ్రయస్థలం కాదని, దేశ భద్రతకు ముప్పుగా మారే ఎవరినీ Read more

×