ఈ ఏడాది రుతుపవనాల కదలికలతో వర్షాకాలం (Rainy season) ముందుగానే ప్రారంభమైంది. ఈ పరిణామం సిమెంట్ మార్కెట్‌పై (On the cement market) ప్రభావం చూపనుందని ఇండియా రేటింగ్స్ వెల్లడించింది. వర్షాలు ముందస్తంగా పడటంతో నిర్మాణ పనులు మందగించనున్నాయి. దీంతో సిమెంట్‌కు గిరాకీ తగ్గే అవకాశం ఉందని అంటున్నారు.2023-24 ఆర్థిక సంవత్సరంలో సిమెంట్ డిమాండ్ 77 శాతంగా ఉండగా, 2024-25లో ఇది 75 శాతానికి తగ్గింది. ఇప్పుడు వర్షాకాల ప్రభావంతో 2025-26లో గిరాకీ మరింత క్షీణించే అవకాశముంది. ముఖ్యంగా వర్షాల కారణంగా ప్రాజెక్టుల పనులు నిలిచిపోవడం దీనికి ప్రధాన కారణం.
అధిక ఉత్పత్తి – తగ్గిన ధరలు
డిమాండ్ తగ్గినా కంపెనీలు ఉత్పత్తిని తగ్గించలేదు. విస్తృతంగా సరఫరా కొనసాగుతోంది. దీంతో డిమాండ్ కంటే సరఫరా ఎక్కువగా మారింది. దక్షిణ భారతదేశం, తూర్పు రాష్ట్రాల్లో ధరలు తగ్గినట్టు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.అసలు వర్షాకాలం జూన్‌లో మొదలవ్వాలి. కానీ ఈసారి మే నుంచే వర్షాలు ప్రారంభమయ్యాయి. చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఫలితంగా నిర్మాణ రంగం వెనకడుగు వేసింది. దీనితో పాటు అమ్మకాలు తగ్గిపోయినట్టు డేటా చెబుతోంది.
వృద్ధిరేటు తగ్గుముఖం
2020-21 కరోనా కాలం తర్వాత, ఇప్పుడు సిమెంట్ వృద్ధిరేటు నెమ్మదిగా క్షీణిస్తోంది. 2024-25లో ఏప్రిల్-సెప్టెంబర్‌లో వృద్ధిరేటు 5-6 శాతాలకే పరిమితమైంది. ఇది గత ఐదేళ్లలో తక్కువగా నమోదైన స్థాయిలో ఉంది.
Read Also : KTR : నేడు సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్న కేటీఆర్