imd warns heavy rains in ap and tamil nadu next four days

మరో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు

హైదరాబాద్‌: మరో అల్పపీడనం నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడింది. ఇది తీరానికి చేరేసరికి బలహీనపడవచ్చని ఐఎండీ వెల్లడించింది. ఫలితాలు రానున్న 4 రోజులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న 4 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి.

Advertisements

గత వారం రోజులుగా పగటి పూట ఉష్ణోగ్రతల్నించి ఉపశమనం కలగనుంది. అదే సమయంలో రాత్రి చలి మరి కాస్త పెరగవచ్చు. ఇప్పటికే తెలంగాణలో రాత్రి వేళ చలి తీవ్రత పెరిగింది. ఈ క్రమంలో వర్షాలు పడితే చలి తీవ్రత మరింత పెరగవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చలి ఎక్కువగా ఉంటోంది. ఇప్పుడు అల్పపీడనం ప్రభావంతో నవంబర్ 11 వరకూ నాలుగు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాలతో పాటు ఈదురు గాలులు వీయనున్నాయి.

అటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా రానున్న 4 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. అల్పపీడనం మరింతగా బలపడే పరిస్థితులు లేవని ఐఎండీ తెలిపింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. చలికాలంలో వర్షాలు పడనుండటంతో ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. జలుబు, జ్వరం, ఒంటి నొప్పుులు బాధించనున్నాయి.

Related Posts
తిరుమలలో బయటపడ్డ భద్రత డొల్లతనం
తొక్కిసలాటపై సీబీఐ విచారణ కేసును కొట్టివేసిన హైకోర్టు

తిరుమలలో భద్రతా వైఫల్యంతో భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా చేస్తోంది. తిరుమలకు చేరుకునే ముందు అలిపిరి వద్దే భద్రతా సిబ్బంది అన్ని వాహనాలను నిలిపివేసి వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. Read more

Betting App Case : నేడు విచారణకు యాంకర్ శ్యామల
betting app case anchor shy

టాలీవుడ్‌లోని ప్రముఖులకు సంబంధించిన బెట్టింగ్ యాప్ కేసు దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులను పోలీసులు విచారణకు పిలిచారు. తాజాగా, టెలివిజన్ Read more

రూపాయి పతనం: కనిష్ట స్థాయికి చేరింది
రూపాయి పతనం: కనిష్ట స్థాయికి చేరింది

అమెరికా డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ 9 పైసలు పతనమై, 85.83 వద్ద రికార్డు కనిష్ట స్థాయికి చేరుకుంది. ఇండియన్ ఇంటర్బ్యాంక్ మారక ద్రవ్య Read more

ఇష్టారాజ్యంగా ఉంటే తొక్కి నార తీస్తాఃడీసీఎం పవన్ కల్యాణ్

ఏపీ డీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల పిఠాపురం పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ పర్యటనలో ఆయన ప్రజలకు భరోసా ఇచ్చారు, అలాగే అధికారుల పనితీరు గురించి Read more