ఓ చిన్నారిని కాపాడబోయిన మంచి మనిషి, తాను ఊహించనివిధంగా నరకం చవి చూశాడు. మానవత్వం చూపిన భారతీయుడు (Indian) జైలుకెళ్లాల్సి వచ్చింది.అమెరికా (American)లోని జార్జియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీన్ని ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి తెచ్చింది ఓ జాతీయ మీడియా ఇంటర్వ్యూ.భారత సంతతికి చెందిన 62 ఏళ్ల మహేంద్ర పటేల్ మార్చిలో ఓ వాల్‌మార్ట్‌కు వెళ్లారు. అక్కడ మొబిలిటీ స్కూటర్‌పై ఉన్న చిన్నారి ఒక్కసారిగా పడిపోతుండగా, వెంటనే అతడిని పట్టుకున్నారు.అయితే చిన్నారి తల్లి అనుమానం పెంచుకుంది. తాను చూడని దృశ్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంది. వెంటనే మహేంద్ర పటేల్‌ను కిడ్నాపర్‌గా భావించింది. పోలీసులు వచ్చి ఆయనను అరెస్ట్ చేసి జైలుకు పంపారు.వాల్‌మార్ట్‌లో ఉన్న సీసీటీవీ వీడియో విషయాన్ని వెలుగు చూసింది. వీడియోలో స్పష్టంగా పటేల్, ఆ చిన్నారిని కాపాడినట్టు కనిపించింది.అతను కేవలం పడిపోతున్న బాలుడిని నిలబెట్టినంత పని చేశాడు. ఎలాంటి దురుద్దేశం లేదు. ఈ ఆధారంతో ఈ నెలలో అతనిపై ఉన్న కేసును అధికారులు విరమించారు.

జైలులో 47 రోజులు – మానసిక, శారీరక నరకం
ఈ కాలంలో పటేల్ ఎదుర్కొన్నవి ఊహించలేనివి. జైలు జీవితం తనను బోలెడంత డిప్రెషన్‌లోకి నెట్టేసిందని ఆయన వాపోయారు.”నా బరువు 17 పౌండ్లు తగ్గింది. మందులు కూడా ఇవ్వలేదు. నేను శాకాహారిని, కానీ రోజూ బ్రెడ్, పీనట్ బటర్‌తో బతికాను. ఒక ఖైదీ బెదిరించాడు. మరొకడు రక్షణ పేరుతో డబ్బు అడిగాడు” అని పటేల్ చెప్పారు.ఇది ఇక్కడితో ముగియలేదు. జైలు వెలుపల కూడా ఆయన కుటుంబం తీవ్రమైన ట్రోలింగ్‌కు గురైంది. సోషల్ మీడియాలో నిందల వర్షం పడింది.”తనను దేశం నుంచి పంపించాలంటూ, తగలబెట్టాలంటూ కామెంట్లు వచ్చాయి. పిల్లలను తినే వ్యక్తిగా ఆయనపై ప్రచారం సాగింది” అని ఆయన తెలిపారు.
క్షమాపణే కావాలి… నష్టపరిహారం కాదు
తన జీవితం దెబ్బతిన్నా, ఆయన డబ్బు కోరడం లేదు. కానీ ఆయనకు న్యాయం కావాలి. పబ్లిక్‌గా క్షమాపణ ఇవ్వాలని, పోలీస్ శాఖ, డిస్ట్రిక్ట్ అటార్నీపై ఆయన డిమాండ్ చేస్తున్నారు.”ఇలాంటి అన్యాయం మరొకరికి జరగకూడదు. బాధితుడికి కనీసం గౌరవం ఇవ్వాలి” అని పటేల్ కోరుతున్నారు.మహేంద్ర పటేల్ పరిస్థితే అందుకు నిదర్శనం. ఒక సత్మార్గుడిగా, పిల్లాడిని కాపాడాలన్న మనసుతో వెళ్లిన పనికి చివరికి బాధే మిగిలింది.
Read Also :