భారత్ తీసుకున్న తాజా నిర్ణయం (The latest decision taken by India) పాకిస్థాన్‌కు తీవ్ర ఆందోళనను కలిగించింది.సింధు జలాల ఒప్పందంలో ఉన్న కొన్ని కీలక భాగాలను నిలిపివేయాలని భారత్ ఇటీవల నిర్ణయించగా, దీనిపై పాకిస్థాన్ ఆర్మీ ప్రతినిధి అహ్మద్ షరీఫ్ చౌదరి (Ahmed Sharif Chaudhry) ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఓ పాకిస్థానీ విశ్వవిద్యాలయంలో జరిగిన సమావేశంలో, లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ, మీరు మా నీటిని ఆపుతే, మేము మీ ఊపిరిని ఆపుతాం,(If you stop our water, we will stop your breathing)అంటూ తీవ్రంగా హెచ్చరించారు. ఇది 2008 ముంబై దాడుల ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్ చేసిన బెదిరింపులే గుర్తుకు తెస్తోంది.ఆ వ్యాఖ్యలు అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపాయి.

పహల్గామ్ ఉగ్రదాడి తరువాత భారత్ కఠినంగా
ఏప్రిల్ 23న జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు.ఈ ఘటన అనంతరం, భారత్ సింధు జలాల ఒప్పందంపై పునర్ పరిశీలనకు వెళ్ళింది.కొన్ని విభాగాలను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది.
1960లో కుదిరిన ఒప్పందం – ఇప్పుడు విమర్శల పాలవుతోంది
ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో 1960లో సింధు నదిపై భారత్–పాకిస్థాన్ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం, పాకిస్థాన్‌కు మూడు ప్రధాన ఉపనదుల నీరు వినియోగించే హక్కు ఇచ్చారు.కానీ ఉగ్రవాదానికి పాక్ మద్దతు కొనసాగుతున్న నేపథ్యంలో, భారత్ ఈ ఒప్పందాన్ని తిరిగి పరిశీలిస్తున్నది.
“చర్చలు కాదు – ముందు ఉగ్రవాదం ఆపాలి”
భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, ఉగ్రవాదం కొనసాగుతుంటే చర్చలకు అర్థం ఉండదు, అని స్పష్టం చేశారు. పాక్ అక్రమంగా ఆక్రమించుకున్న భారత భూభాగాలపై చర్చలు తప్ప, మిగిలిన అంశాలపై భారత్ ఆసక్తి చూపదన్నారు.
మోదీ ఘాటు స్పందన
ఇంతకుముందు బికనీర్‌లో జరిగిన సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ,పాకిస్థాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తే, ఒక్క పైసా కోసమే శ్రమించాల్సి వస్తుంది,అని హెచ్చరించారు.భారతీయుల రక్తంతో ఆడుకోవడం ఇకపై ఖరీదైన పని అవుతుంది,అంటూ తీవ్రంగా స్పందించారు.
భారత్ స్పష్టం – “నీరు, రక్తం కలవవు”
ప్రధాని మోదీ గతంలో చేసిన వ్యాఖ్యను జైస్వాల్ మరోసారి గుర్తు చేశారు–నీరు, రక్తం కలవవు.ఇది భారత్ ఇప్పుడు ఎంచుకున్న దృఢమైన వైఖరికి ప్రాతినిధ్యం వహిస్తోంది.
Read Also : Shehbaz Sharif : పహల్గామ్ ఘటనపై నోరు పారేసుకున్న పాక్ ప్రధాని