పవన్ కు కౌంటర్ ఇచ్చిన అంబంటి రాంబాబు
అమరావతి: పవన్ కళ్యాణ్ సీఎం కావాలంటే గోవా వెళ్లాల్సిందేనని మాజీ మంత్రి, వైసీపీ నేత సెటైర్లు విసిరారు. జగన్ కు ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీ వెళ్లాలంటూ పవన్ చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు తన X ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ రోజు వైసీపీ శాసనసభ్యులు, జగన్ అసెంబ్లీకి హాజరయ్యారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ ఆందోళన చేస్తూ గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. అనంతరం వాకౌట్ చేసి వెళ్లిపోయారు. ఈ అంశంపై పవన్ కల్యాణ్ స్పందించారు.

ప్రజలే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు..
అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా తానో లేదా సీఎం చంద్రబాబో ఇచ్చేది కాదన్నారు. ప్రజలే ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్నారు. ఎక్కువ ఓట్ల శాతం వచ్చిన పార్టీకి ఎక్కువ సేపు మాట్లాడే ఛాన్స్ జర్మనీలోనే ఉంటుందన్నారు. ఆ అవకాశం కావాలంటే జగన్ ఆ దేశానికి వెళ్లాల్సి ఉంటుందన్నారు. గోవాలో అసెంబ్లీ స్థానాలు కేవలం 40 మాత్రమే ఉంటాయి. అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మేజిక్ ఫిగర్ 21. గత ఎన్నికల సమయంలో జనసేనకు కూడా 21 సీట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.
ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటూ డిమాండ్
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడంతో కూటమి పార్టీపై వైసీపీ వైసీపీ పై కూటమి పార్టీలో సెటైర్లు వేసుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ అసెంబ్లీ సమావేశాలకు హాజరైన వైసీపీ నేతలు అసెంబ్లీలోకి అడుగుపెట్టిన 10 నిమిషాలకే బయటకు వచ్చేసారు. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటూ డిమాండ్ చేశారు అయితే వైసీపీకి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రతిపక్ష హోదా రాదు అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో మాట్లాడారు.