ICC 2024 టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నాలుగు దేశాల నుంచి అత్యుత్తమ ఆటగాళ్లను ఎంపిక చేసింది. భారత్, పాకిస్థాన్,ఆస్ట్రేలియా,జింబాబ్వేకు చెందిన ఈ నామినీలంతా ఈ ఏడాది తమ అద్భుతమైన ప్రదర్శనతో అభిమానులను మెప్పించారు.టీ20 క్రికెట్‌లో తన కుదురైన బౌలింగ్‌తో భారత విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.2024 టీ20 ప్రపంచ కప్‌లోనూ అర్షదీప్ తన అద్భుత ప్రదర్శనతో అందరి ప్రశంసలు అందుకున్నాడు.ఈ ఏడాది ఆడిన 18 టీ20 మ్యాచ్‌ల్లో అర్షదీప్ 36 వికెట్లు తీసి తన ప్రతిభను మరోసారి నిరూపించుకున్నాడు.టీమిండియా విజయాలకు ఇతని పాత్ర కీలకమైందని చెప్పవచ్చు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ ట్రావిస్ హెడ్ కూడా ఈ అవార్డుకు నామినేట్ అయ్యాడు. 2024లో ట్రావిస్ హెడ్ 15 టీ20 మ్యాచ్‌లలో 539 పరుగులు చేసి తన సత్తా చాటాడు.

అతని అత్యుత్తమ ఇన్నింగ్స్ 80 పరుగులు ఉండగా, 178.47 స్ట్రైక్ రేట్ అతని బ్యాటింగ్ ధాటిని స్పష్టంగా తెలియజేస్తుంది. ఆస్ట్రేలియా విజయాల్లో కీలక పాత్ర పోషించిన హెడ్ టీ20 ఫార్మాట్‌లో అసాధారణ ప్రతిభ కనబరిచాడు. ఈ ఏడాది 24 మ్యాచ్‌ల్లో రజా 573 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో 24 వికెట్లు తీసి జట్టు విజయాల్లో తనదైన ముద్ర వేశాడు. అతని అత్యుత్తమ ఇన్నింగ్స్ 133 నాటౌట్ ఉండగా, ఆల్‌రౌండర్‌గా అతని ప్రదర్శన ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఈ ఏడాది టీ20 ఫార్మాట్‌లో నిరంతరం ఆకట్టుకున్న ఆటగాళ్లలో ఒకడు. 24 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో బాబర్ 738 పరుగులు చేయడంతో పాటు అతని అత్యుత్తమ స్కోరు 75 నాటౌట్‌గా ఉంది. జట్టుకు స్థిరతనిచ్చే బ్యాట్స్‌మన్‌గా బాబర్ తన ప్రత్యేకతను చాటాడు. ICC టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ప్రతీ ఏడాది అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాడికి అందజేయబడుతుంది.