I will be with Pawan Kalyan, whether he holds office or not.. Balineni

janasena : పదవి ఉన్నా, లేకున్న పవన్‌ కల్యాణ్ వెంటే ఉంటా : బాలినేని

janasena : మాజీ మంత్రి, ఆ పార్టీ నేత బాలినేని శ్రీనివాస్‌రెడ్డి కాకినాడ జిల్లా పిఠాపురం శివారులోని చిత్రాడలో ఏర్పాటు చేసిన ‘జయ కేతనం’ సభలో మాట్లాడారు. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో సినిమా తీయాలనేది తన కోరిక అని, ఇదే విషయం ఆయనకు చెప్పానని అన్నారు. పిఠాపురం సాక్షిగా అన్నీ నిజాలే చెబుతా. నాకు ప్రాణం ఉన్నంత వరకు.. పదవి ఉన్నా, లేకపోయినా పవన్‌ కల్యాణ్ వెంటే ఉంటా. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎంతో నష్టపోయా. మా తండ్రి ఇచ్చిన ఆస్తిలో సగం అమ్మేశా అన్నారు.

Advertisements
janasena  పదవి ఉన్నా, లేకున్న

చేసిన పాపాలు ఎక్కడికీ పోవు

జగన్‌ వల్ల నేను, నా కుటుంబ సభ్యులు ఎంతో బాధపడ్డాం. నా ఆస్తులు, నా వియ్యంకుడికి ఉన్న ఆస్తులను కూడా జగన్‌ కాజేశారు. జగన్‌ చేసిన అన్యాయాలు చెప్పాలంటే సమయం సరిపోదు. రఘురామకృష్ణరాజు ఏదో అన్నారని లోపల పెట్టి ఆయన్ను కొట్టించావు. చేసిన పాపాలు ఎక్కడికీ పోవు అని జగన్‌ తెలుసుకోవాలి. కూటమి ప్రభుత్వం వచ్చాక చిన్న చిన్న వారిని అరెస్టు చేస్తున్నారు. స్కాములు చేసి, రూ.కోట్లు సంపాదించిన వారిని ఇంకా అరెస్టు చేయడంలేదు.. అదే నా బాధ. వైఎస్‌ను అడ్డం పెట్టుకుని జగన్‌ సీఎం అయ్యారు. పవన్‌ కల్యాణ్‌ స్వశక్తితో ఎదిగి నాయకుడు అయ్యారు అని బాలినేని అన్నారు.

Related Posts
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు: పబ్లిక్ ఆఫీసులు, స్కూళ్లు మూసివేత, బ్యాంకులు అందుబాటులో
elections

మహారాష్ట్రలో ఈరోజు (నవంబర్ 20) జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులను తెచ్చే అవకాశాన్ని కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రజలు తమ ఓటు హక్కును Read more

వైసీపీ పాలనలో విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్ పతనం – నారా లోకేష్
వలసల నివారణకు చర్యలు తీసుకుంటాం: లోకేష్

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల నాణ్యత దిగజారిందని, వైసీపీ ప్రభుత్వం వీసీల నియామకాల్లో పారదర్శకత పాటించలేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డి తన Read more

HCU: హెచ్‌సీయూ భూముల వివాదం.. పలువురు నాయకులపై కేసు నమోదు
HCU: హెచ్‌సీయూ భూముల వివాదం.. పలువురు నాయకులపై కేసు నమోదు

హైదరాబాద్ హెచ్‌సీయూ భూములపై తప్పుడు ప్రచారం ఘటనపై కేసులు హైదరాబాద్‌లోని కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) భూములను గురించి సోషల్ మీడియా ప్రచారం ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతోంది. Read more

‘ప్రైడ్ ఆఫ్ నేషన్ అవార్డ్స్ -2024’
various fields at 'Pride of Nation Awards 2024'

హైదరాబాద్: వివిధ రంగాలకు చెందిన అసాధారణ వ్యక్తులను వారి అంకితభావం, నైపుణ్యాలకు సంబంధించి సత్కరించేందుకు ఆసియా టుడే "ప్రైడ్ ఆఫ్ నేషన్ అవార్డ్ 2024"ని నిర్వహిం చింది. Read more

×