I like the post of Home Minister.. Rajagopal Reddy

Rajagopal Reddy : నాకు హోంమంత్రి పదవి అంటే ఇష్టం: రాజగోపాల్ రెడ్డి

Rajagopal Reddy : తనకు హోంమంత్రి పదవి అంటే ఇష్టమని కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ కేబినెట్ విస్తరణపై ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన అసెంబ్లీలో మీడియాతో చిట్ చాట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి వస్తుందనే అనుకుంటున్నా. సామర్థ్యాన్ని బట్టి మంత్రులను ఎంపిక చేయాలి. భువనగిరి పార్లమెంట్ బాధ్యతలు ఇస్తే సమర్థవంతంగా నిర్వహించా. ఏ పదవి వచ్చినా సమర్థవంతంగా నిర్వహిస్తా, ప్రజల పక్షాన నిలబడతా అన్నారు.

నాకు హోంమంత్రి పదవి అంటే

మంత్రి వర్గ విస్తరణకు సానుకూల సంకేతాలు

నిన్న ఢిల్లీలో సీరియస్‌గానే కేబినెట్‌ విస్తరణపై చర్చ జరిగినట్లు ఉంది. అయితే నాకు ఇప్పటివరకు ఢిల్లీ నుంచి ఫోన్ రాలేదు..అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాగా తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం అమోద ముద్ర వేసినట్టు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌ రెడ్డికి కాంగ్రెస్‌ పెద్దలు మంత్రి వర్గ విస్తరణకు సానుకూల సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. తాజా మంత్రి వర్గ విస్తరణలో కనీసం నలుగురికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్టు సమాచారం.

క్యాబినేట్‌ విస్తరణతో పాటు ఇతర పదవులు నామినేటెడ్ పోస్టులు

కాగా, తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం దాదాపుగా ఖరారు అయింది. ఉగాది నాటికి విస్తరణ పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. గత ఏడాదిన్నరగా విస్తరణకు సంబంధించి అనేక ఊహగానాలు వినిపించినప్పటికీ తాజాగా అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. క్యాబినేట్‌ విస్తరణతో పాటు ఇతర పదవులు నామినేటెడ్ పోస్టుల నిర్ణయం తీసుకోనున్నారు. నిన్న (సోమవారం) ముఖ్యమంత్రి ఢిల్లీలో పార్టీ ఆగ్రనేత‌ల‌తో భేటీ అయ్యారు. సీఎంతో పాటు డిప్యూటి సీఎం భ‌ట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మ‌హేశ్ కుమార్ గౌడ్‌, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు.

Related Posts
తెలంగాణ భవిష్యత్తును తాకట్టు పెడుతున్న రేవంత్ రెడ్డి: కవిత
తెలంగాణ భవిష్యత్తును తాకట్టు పెడుతున్న రేవంత్ రెడ్డి: కవిత

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ముసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. ప్రాజెక్ట్ కోసం రూ.4,100 కోట్ల ప్రపంచ బ్యాంక్ రుణాన్ని కోరుతూ ప్రభుత్వం ప్రపోజల్ Read more

Pakistan:పాకిస్థాన్ లో కాన్వాయ్ రెండో దాడి
Pakistan పాకిస్థాన్ లో కాన్వాయ్ రెండో దాడి

Pakistan:పాకిస్థాన్ లో కాన్వాయ్ రెండో దాడి పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) మార్గంలో పాక్ ఆర్మీ కాన్వాయ్‌ను Read more

టీడీపీలోకి వైసీపీ నేత చేరిక.
టీడీపీలోకి వైసీపీ నేత చేరిక.

పులివెందులపై టీడీపీ లక్ష్యం ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పులివెందుల మున్సిపాలిటీపై దృష్టి సారించింది. జగన్ ఆధిపత్యానికి చెక్ పెట్టేలా పావులు కదుపుతోంది. Read more

మోదీతో శ్రీలంక అధ్యక్షుడు దిసనాయకే భేటీ..!
WhatsApp Image 2024 12 16 at 3.57.13 PM

శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే మూడురోజుల పర్యటన కోసం భారత్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, రక్షణ, వాణిజ్యం, పెట్టుబడుల అంశంపై ప్రధాని Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *