I left YSRCP because I was mentally broken.. Vijayasai Reddy

మనస్సు విరిగిపోవడం వల్లనే వైసీపీ నుంచి వైదొలిగా : విజయసాయిరెడ్డి

అమరావతి: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కాకినాడ పోర్టు అక్రమాల కేసులో సీఐడీ విచారణ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. జగన్‌ చుట్టూ కోటరీ ఉందని.. ఆ కోటరీ వల్లే ఆయనకు తాను దూరమైనట్లు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. జగన్‌ మనసులో స్థానం లేదని తెలిశాక తన మనసు విరిగిపోయిందన్నారు. అందుకే పార్టీ నుంచి వెళ్లిపోతున్నానని జగన్‌కు చెప్పినట్లు సాయిరెడ్డి పేర్కొన్నారు. కోటరీ నుంచి బయటపడితేనే జగన్‌కు భవిష్యత్తు ఉంటుంది. జగన్‌ చుట్టూ కొందరు నేతలు కోటరీగా ఏర్పడ్డారు. జగన్‌ను కలవాలంటే ఈ కోటరీకి లాభం చేకూర్చాలి. నాయకుడు అనేవాడు చెప్పుడు మాటలు నమ్మకూడదు అని వ్యాఖ్యలు చేశారు.

మనస్సు విరిగిపోవడం వల్లనే వైసీపీ

దీంట్లో చాలా మంది పాత్రధారులు, సూత్రధారులు

వైసీపీలో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు నాకూ మా నాయకుడికి మధ్య అభిప్రాయ భేదాలు సృష్టించి, జగన్‌మోహన్‌రెడ్డి మనసు విరిచే ప్రయత్నం చేసి, విజయం సాధించారు. మూడున్నర సంవత్సరాల పాటు అవమానాలు పాలయ్యా. నేను దిగిన ప్రతి మెట్టు ఇంకొకరు పైకి ఎక్కడానికి ఉపయోగపడింది. దీంట్లో చాలా మంది పాత్రధారులు, సూత్రధారులు ఉన్నారు. ఈ పార్టీ నుంచి వెళ్లిపోయినందుకు నేను ఏవిధంగానూ నష్టపోవడం లేదు. చిత్తశుద్ధితో పనిచేశా. ఇప్పుడు కూడా జగన్‌మోహన్‌రెడ్డి బాగుండాలని కోరుకుంటున్నా. జగన్‌ చుట్టూ ఉన్న కోటరీ నుంచి ఎప్పుడు బయటపడతారో ఆ రోజు ఆయనకు భవిష్యత్‌ ఉంటుంది. ఇంతకన్నా ఏమీ చెప్పలేను అన్నారు.

అంతే తప్ప నేను చేసిందేమీ లేదు

కాకినాడ పోర్టులో వ్యాపారం చేశారా? లేదా? కోట్లు ఆర్జించారా? అన్న విషయం నాకు తెలియదని సీఐడీ విచారణలో చెప్పా. గతంలో సీబీఐ, ఈడీ కేసుల్లో జేడీ లక్ష్మీనారాయణ నన్ను ఏ2గా చేర్చారు. ఇప్పుడు కాకినాడ పోర్టు కేసులో కూడా ఏ2 ఉంచారు. అంతే తప్ప నేను చేసిందేమీ లేదు. ఏ2ను నాకు ఒక స్టాండడైజ్‌ చేశారు. ఈ కేసు రిజిస్టర్‌ అయినప్పుడు వైసీపీలోనే ఉన్నాను. అప్పుడు నాకు పూర్తి వివరాలు తెలియవు. ఈరోజు నాకు పూర్తి అవగాహన వచ్చింది. ఎవరు చేశారు? ఎలా చేశారు? అన్న విషయాలు తెలిశాయి. జగన్‌మోహన్‌రెడ్డిని కేసు నుంచి పక్కకు తప్పించడానికి మీరూ, విక్రాంత్‌రెడ్డి ప్రయత్నం చేస్తున్నారా అని అడిగారు. అవన్నీ నాకు తెలియవని చెప్పాను అన్నారు.

Related Posts
మంత్రి నారా లోకేష్ కృషి వ‌ల్లే ఏపీకి ఆర్సిలర్ మిట్టల్ ఉక్కు ప‌రిశ్ర‌మ‌
ఆర్సిలర్ మిట్టల్ ఉక్కు ప‌రిశ్ర‌మ‌

ఆర్సిలర్ మిట్టల్ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ ఏపీకి వరం రాష్ట్రానికి ప్రపంచ ప్రఖ్యాత ఆర్సిలర్ మిట్టల్ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ రాబోతోందని, దీనివల్ల పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కలుగనున్నాయని Read more

భావ తీవ్రత ఉన్నందుకే పోరాట యాత్ర చేసాం – పవన్
pawan janasena

జనసేన పార్టీ స్థాపన వెనుక ఉన్న అసలైన కారణాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి వెల్లడించారు. 2014లో పార్టీని ఏర్పాటు చేసినప్పటికీ, రాజకీయాల్లో పూర్తిస్థాయిలో ప్రజాసమస్యలపై Read more

భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం
Bharti Airtel, Bajaj Finance strategic partnership

న్యూఢిల్లీ : భారతదేశపు అతిపెద్ద టెలికాం సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటైన భారతీ ఎయిర్టెల్ మరియు దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC) Read more

తలసేమియా భాదితులకు సహాయం కోసం మ్యూజికల్ నైట్: భువనేశ్వరి
nara bhuvaneshwari

తలసేమియా బాధితుల సహయార్థం ఈనెల 15న విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మ్యూజికల్ నైట్ నిర్వహిస్తున్నారు. ఈ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *