Kadiyam Srihari : వరంగల్ జిల్లాలో నేనే టాల్ లీడర్‌ని అని కడియం శ్రీహరి అన్నారు. 14 ఏళ్లు మంత్రిగా పనిచేశా. 4 సార్లు ఎమ్మెల్యే , ఒకసారి ఎంపీ, ఒకసారి ఎమ్మెల్సీగా పని చేశా. వరంగల్ జిల్లాలో నేనే టాల్ లీడర్‌ను అని వెల్లడించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపణలను తిప్పికొట్టిన కడియం శ్రీహరి నేను అటవీ భూములను ఆక్రమించుకున్నట్లు నాపై తప్పుడు ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహించారు. ఒకవైపు రైతుల పట్టా భూములు, అటవీ భూములను రక్షించాలని నేను ప్రయత్నిస్తుంటే నాపైనే నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

మీడియా మిత్రులందరికీ మనిషికి 20 ఎకరాలు రాసిస్తా
ఈ ఆరోపణలకు వివరణ ఇవ్వాలంటే నాకే సిగ్గుగా అనిపిస్తుందని చురకలు అంటించారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. నా పేరుమీద 2వేల ఎకరాలు ఉంటే వరంగల్ జిల్లాలో ఉన్న మీడియా మిత్రులందరికీ మనిషికి 20 ఎకరాలు రాసిస్తా అంటూ కడియం శ్రీహరి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎకో టూరిజంగా దేవునూర్ గుట్ట భూములు… అటవీ భూముల సంరక్షణకు కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. దేవునూర్ గుట్టల్లో ఉన్న భూములను ఎకో టూరిజంగా డెవలప్ చేస్తామన్నారు.
ఈ ఇద్దరు నేతలు కౌంటర్ల మీద కౌంటర్ల
స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిల మధ్య వాగ్వాదం రోజురోజుకూ తీవ్రతరమవుతోంది. ఈ నేతలు ఇద్దరు కౌంటర్ల మీద కౌంటర్ల ఇచ్చకోవడంతో జిల్లాలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. తాజాగా కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలకు పల్లా రాజేశ్వర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తనను బొచ్చు కుక్క అన్న వ్యాఖ్యలను తనదైన శైలిలో పల్లా రాజేశ్వర్ రెడ్డి తిప్పికొట్టారు.
Read Also : దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో నిందితులకు ఉరిశిక్ష