టెన్నిస్ దిగ్గజం నోవాక్ జొకోవిచ్ (Novak Djokovic)–భారత క్రికెట్ ఐకాన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) మధ్య ఉన్న బంధం తాజాగా అభిమానులను ఆకట్టుకుంది. వింబుల్డన్ టోర్నీలో జొకోవిచ్ పోరును కోహ్లీ ప్రత్యక్షంగా వీక్షించడం ఇప్పుడు వైరల్ అయింది.జొకోవిచ్ తన విజయం అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “విరాట్ కోహ్లీతో మా మధ్య మంచి స్నేహం ఉంది. కొన్నేళ్లుగా టెక్స్ట్ ద్వారా మాట్లాడుకుంటున్నాం. కానీ ఇప్పటివరకు వ్యక్తిగతంగా కలుసుకోలేకపోయాం” అని చెప్పారు. కోహ్లీ తనపై చూపిన అభిమానం తనకు గర్వకారణమని పేర్కొన్నారు.

“గ్లాడియేటర్!” – కోహ్లీ ప్రశంస
కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో జొకోవిచ్‌ను ‘గ్లాడియేటర్’గా అభివర్ణిస్తూ షేర్ చేసిన పోస్ట్ అభిమానుల్ని ఆకట్టుకుంది. దీనిపై స్పందించిన జొకోవిచ్, కోహ్లీలా లెజెండ్ నా గురించి అలా స్పందించడం సంతోషానిదే అన్నారు.క్రికెట్ గురించి మాట్లాడిన జొకోవిచ్ సరదాగా స్పందించారు. “నేను చిన్నప్పుడు క్రికెట్ ఆడేవాడిని. కానీ దానిలో అంతగా రాణించలేదు. భారత్‌లో క్రికెట్‌కి ఉన్న మద్దతు నాకు తెలుసు. అందుకే అక్కడికి వెళ్లేలోపు నా ఆటను మెరుగుపరచాలి, లేకపోతే షర్మిండి అవుతాను” అంటూ నవ్వించారు.
వింబుల్డన్‌లో అదరగొట్టిన జొకోవిచ్
ఆస్ట్రేలియా ఆటగాడు అలెక్స్ డి మినార్‌తో జరిగిన మ్యాచ్‌లో జొకోవిచ్ అదరగొట్టాడు. తొలి సెట్‌ను 1-6తో కోల్పోయినా, ఆ తర్వాత బలంగా పుంజుకుని 6-4, 6-4, 6-4తో మిగతా మూడు సెట్లు గెలిచాడు. ఈ విజయం అతనికి వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్‌లో 16వ సారి ప్రవేశించేందుకు దారితీసింది.ఈసారి వింబుల్డన్ టైటిల్‌ను గెలిస్తే, జొకోవిచ్‌కి ఇది తొమ్మిదో టైటిల్ అవుతుంది. దీంతో ఫెదరర్ పేరిట ఉన్న 8 టైటిళ్ల రికార్డును సమం చేయనున్నారు.
Read Also : elephant death : వందేళ్లకు పైబడిన వత్సల అనే ఏనుగు మృతి