I am a milk trader.. it is our responsibility.. Lokesh

Lokesh: నేను పాల వ్యాపారిని.. అది మనందరీ బాధ్యత : లోకేశ్

Lokesh: ఏపీ మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆయన చదువు అనంతరం నేరుగా రాజకీయాల్లోకి రాలేదని.. పాల వ్యాపారం చేసేవాడిని అని చెప్పుకొచ్చారు. శుక్రవారం తన నియోజకవర్గమైన మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడారు. నేను రాజకీయాల్లోకి రాకముందు పాల వ్యాపారం చేసే వాడిని. గోసేవ చేస్తే ఆ దేవునికి సేవ చేసినట్లే. గోసంరక్షణ అనేది మనందరి బాధ్యత. అందుకే నేను మంగళగిరి ఎమ్మెల్యేగా గెలిచాక గోశాలను ప్రారంభించాను అని మంత్రి నారా లోకేశ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం రాజకీయవర్గాల్లో ఆసక్తిగా మారాయి.

Advertisements
Lokesh నేను పాల వ్యాపారిని

జీవితాంతం గుర్తుండిపోయేలా అభివృద్ధి

మంగళగిరి నియోజకవర్గం వాసులకు జీవితాంతం గుర్తుండిపోయేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని మంత్రి నారా లోకేశ్ అన్నారు. మంగళగిరి మండలం యర్రబాలెంలో నూతన మహావీర్ గోశాల భవనాన్ని కేంద్రమంత్రి పేమ్మసాని చంద్రశేఖర్ తో కలిసి నారా లోకేశ్ ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో భారీ మెజార్టీతో తనను గెలిపించిన మంగళగిరి వాసులకు జీవితాంతం గుర్తుండిపోయేలా అభివృద్ధి కార్యక్రమాలను రానున్న వంద రోజుల్లో ప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారు. భూగర్భ డ్రైనేజీ, నడుమూరు ఫ్లైఓవర్ పనులు, పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నామని చెప్పారు. మంగళగిరికి రాజధానికి మధ్య ఎంతో కీలకమైన నిడమర్రు రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు మరో నెలలో ప్రారంభిస్తామని లోకేశ్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సవరించడానికి చాలా సమయం పడుతుందని అన్నారు.

Related Posts
ఫార్ములా ఈ కార్ రేస్ లో దూకుడు పెంచిన ఈడీ
formula e race hyderabad kt

ఫార్ములా ఈ కార్ రేస్‌లో అవినీతి ఆరోపణలపై ఏసీబీ, ఈడీ దర్యాప్తును ముమ్మరం చేశాయి. ఈ-కార్ రేస్‌కు సంబంధించిన లావాదేవీలపై లోతైన విచారణ చేపట్టిన ఈడీ, ఇప్పటికే Read more

చంద్రబాబు దావోస్ పర్యటన పై వైసీపీ సెటైర్లు
cbn davos

చంద్రబాబు దావోస్ పర్యటనపై వైసీపీ మరోసారి తీవ్ర విమర్శలు చేసింది. 'చంద్రబాబు గెలిస్తే చాలు దావోస్ వెళ్లి పెట్టుబడులంటూ బిల్డప్ ఇస్తారని YCP విమర్శించింది. 'అధికారంలో ఉన్న Read more

Bypoll : ఉపఎన్నికలకు సిద్ధంగా ఉండండి అంటూ కేటీఆర్ పిలుపు
KTR: ఎమ్మెల్సీ ఎన్నికలపై కేటీఆర్ సంచలన ప్రకటన

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఏడాదిలో ఉపఎన్నికలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంటూ అందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. అత్తాపూర్ డివిజన్‌ Read more

కీలక నేతలతో వైఎస్ జగన్ భేటీ
jagan metting

వైసీపీ మరింత బలోపేతం కావడానికి సముచిత వ్యూహాన్ని రూపొందించాల్సిన అవసరం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక నేతలతో భేటీ అయ్యారు. Read more

×