YouTuber arrest: హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ‘వైరల్ హబ్’ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు కంబేటి సత్యమూర్తిని బుధవారం అదుపులోకి తీసుకున్నారు. మైనర్లను లక్ష్యంగా చేసుకుని అసభ్యమైన ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. 15 నుంచి 17 ఏళ్ల వయసున్న బాలబాలికలతో అనుచిత ప్రశ్నలు వేస్తూ, అసభ్యంగా ప్రవర్తించిన దృశ్యాలను రికార్డు చేసి ఆన్‌లైన్‌లో ప్రచారం(Online promotion) చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.
Read also: AP Bus Accident: ట్రావెల్స్ బస్సులో మంటలు

ఈ వీడియోలను వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో ప్రమోట్ చేసినట్లు కూడా ఆధారాలు లభించినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పోక్సో చట్టం, ఐటీ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మైనర్లతో సంబంధం ఉన్న కంటెంట్ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, చట్టవిరుద్ధంగా వీడియోలు తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని సైబర్ క్రైమ్(cyber crime) పోలీసులు హెచ్చరించారు. తల్లిదండ్రులు కూడా పిల్లల ఆన్‌లైన్ భద్రతపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper:epaper.vaartha.com
Read also: