వర్సిటీ ఉపకులపతి జ్ఞానప్రకాష్ హైదరాబాద్ (అత్తాపూర్) : విద్యార్థులకు విద్యతో పాటు 1 తెలంగాణ రైతులకు సేవ చేయడంలో పివి నరసింహారావు పశువైద్య (Vetarnity) విశ్వవిద్యాలయం ముందుందని విశ్వవిద్యాలయం 5వ స్నాతకోత్సవ ఈ నెల 19న నిర్వహించనున్నట్లు ఉపకులపతి జ్ఞానప్రకాష్ పేర్కొన్నారు. బుధవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపకులపతి జ్ఞానప్రకాష్ మాట్లాడుతూ ఈనెల 19న పశువైద్య (Vetarnity) విశ్వవిద్యాలయం 5వ స్నాత కోత్సవాన్ని ఉదయం 10 గంటలకు ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర విశ్వ విద్యాలయం ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ స్నాత కోత్సవానికి గవర్నర్ జిష్ణుదేవవర్మ (Governor Jishnu Deva Varma) హాజరు కానున్నారని, అతిథులుగా జాతీయ డెయిరీ అభివృద్ధి బోర్డు ఆనంద్ గుజరాత్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మీనేష్ షా (Meenesh Shah) హాజరై ప్రసంగిస్తారని పేర్కొన్నారు.

Vetarnity
అత్యాధునిక టెక్నాలజీతో కూడిన సేవలను
అదేవిధంగా బోర్డు ఆఫ్ మేనేజ్మెంట్ సభ్యులు, అకాడమిక్ కౌన్సిల్ సభ్యులు, పూర్వ ఉపకుల పతులు, పశువైద్య విభాగంలో నిష్ణాతులు పాల్గొననున్నారని ఆయన అన్నారు. ఈ స్నాతకోత్సవంలో 2023 జనవరి నుండి 2024 డిసెంబరు 31 వరకు పట్టభద్రులైన మొత్తం 524 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రధానం చేయబడతాయి. వీరి లో 16 మంది పిహెచ్.డి. (PHD) పట్ట భద్రులు, 69 మంది మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ (ఎస్బిఎన్ సీ) పట్టభద్రులు, 345 మంది బాచిలర్ ఆఫ్ 54 వెటర్నర్ సైన్ అండ్ (బివిఎస్ సి, ఎహెచ్) పట్టభద్రులు, మంది బిటెక్ డెయిరీ టెక్నాలజీ, పట్టుభద్రులు, 40 మంది బాచిలర్ ఆఫ్ ఫిషరీ సైన్స్ పట్టభద్రులు, వివిధ విభాగాలలో విశిష్ట ప్రతిభ కనబరిచిన ప్రతిభావంతులైన విద్యార్థులకు 25 బంగారు పతకాలను ప్రధానం చేయనున్నామని ఉత్తమ అధ్యాకులకు రెండు అవార్డులు అంద జేయనున్నట్లు తెలిపారు. పివి నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం రైతులకు క్షేత్రస్థాయిలో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నమని తెలంగాణ రైతులకు అత్యాధునిక టెక్నాలజీతో కూడిన సేవలను అందజేస్తున్నామని పేర్కొన్నారు.
పివి నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం 5వ స్నాతకోత్సవం ఎప్పుడు జరగనుంది?
ఈ నెల 19వ తేదీ ఉదయం 10 గంటలకు జరగనుంది.
స్నాతకోత్సవ కార్యక్రమం ఎక్కడ నిర్వహించబడుతుంది?
ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో నిర్వహించబడుతుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: