రంగారెడ్డి జిల్లా(Rangareddy District) చేవెళ్ల వద్ద జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంపై కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘోర ఘటనలో ఇప్పటివరకు 25 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 20 మందికి పైగా గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంలో పాల్గొన్న టిప్పర్ లారీ, బస్సుపై పలు చలాన్లు(Vehicle Challan) ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బస్సుపై మూడు సిగ్నల్ జంప్ చలాన్లు, లారీపై రెండు నో ఎంట్రీ చలాన్లు నమోదయ్యాయని తెలిపారు. లారీపై రూ.3,270, బస్సుపై రూ.2,305 జరిమానాలు ఉన్నాయని ఫోటోలు ద్వారా వెల్లడించారు. ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమా, లేక లారీ డ్రైవర్ తప్పిదమా అన్న విషయంలో విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Read Also: Chevella Accident: చేవెళ్ల ప్రమాదం.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు
చలాన్లు ఉన్న బస్సు, లారీ – 25 మంది మృతి, కుటుంబాలపై విషాదం
ఈ ప్రమాదం అనేక కుటుంబాలను శోకసంద్రంలో ముంచేసింది. తాండూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో ప్రయాణిస్తున్న వారిలో 24 మంది దుర్మరణం చెందగా, అందులో 11 మంది మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. ముఖ్యంగా తాండూరు వడ్డెరగల్లీకి చెందిన అక్కాచెల్లెలు తనూషా, సాయి ప్రియా, నందిని ముగ్గురూ ఒకేసారి ప్రాణాలు కోల్పోవడం(Vehicle Challan) హృదయవిదారకంగా మారింది. ఇటీవలే ఓ పెళ్లి వేడుకలో ఆనందంగా గడిపిన వీరు ఇలా మృతదేహాలుగా మారడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ముగ్గురూ హైదరాబాద్‌లోని కోఠి మహిళా కళాశాలలో చదువుతున్న విద్యార్థినులుగా గుర్తించారు.
అలాగే యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్‌కు చెందిన ఎంబీఏ విద్యార్థిని అఖిలరెడ్డి కూడా ఈ ప్రమాదంలో మృతి చెందారు. కుమార్తె మృతితో అఖిల తల్లి బోరున విలపించగా, కుటుంబ సభ్యులు కూడా కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనపై ప్రభుత్వం హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. ప్రయాణికుల వివరాలు తెలుసుకునేందుకు 9912919545, 9440854433 నంబర్లకు సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాయపడిన వారిని మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించి, అవసరమైన వైద్య సౌకర్యాలు అందించాలని అధికారులకు ఆదేశించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: